ఇదేందయ్యా ఇది.. కొవ్వు తగ్గించడానికి చపాతీ కర్రతో పొట్టపై రుద్దారు..

బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి చపాతీ రోలర్‌ను( Chapati roller ) పొట్టపై చాలా వేగంగా రుద్దుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘ద పర్ఫెక్ట్ హెల్త్ హైడ్ కోటి’( The Perfect Health Hide Koti ) అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ మొదట షేర్ చేసిన ఈ వీడియోలో ఆక్యుప్రెషర్ ట్రైనర్‌ తన కస్టమర్ల పొట్టపై చపాతీ రోలర్‌ను రుద్దడం చూడవచ్చు.ఈ వీడియో 5 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ పొందింది.దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.ఇదేం కొవ్వు తగ్గించే విధానం బాబోయ్ అంటూ మరికొందరు నోరెళ్లబెడుతున్నారు.

 This Is This Chapati Sticks Are Rubbed On The Stomach To Reduce Fat, Belan, Roll-TeluguStop.com

వీడియోలో ఆక్యుప్రెషర్ ట్రైనర్‌( Acupressure Trainer ) దగ్గరకు పెద్ద సంఖ్యలో కస్టమర్లు ఉండటం కనిపించింది.ఆ తర్వాత రోటీలు చేయడానికి ఉపయోగించే చపాతీ కర్రలను ఉపయోగించడం చూడవచ్చు.ఇలా చేయడం వల్ల పొట్టుకోవు తగ్గుతుందా లేదా అనేదానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటూ ఏదీ లేదు.

అయినా సదరు ట్రైనర్ చెప్పినట్లు కస్టమర్లు గుడ్డిగా చేసేస్తున్నారు.సమతుల్య ఆహారంతో పాటు రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తేనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది.

మిగతా ఏ ప్రయత్నాలు కూడా పెద్దగా ప్రభావం చూపమని నిపుణులు కూడా చెబుతున్నారు.అయినా కొందరు త్వరగా బరువు తగ్గాలని తపనతో ఉపయోగం లేని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉన్న అనేక సాంప్రదాయేతర బరువు తగ్గించే పద్ధతులకు రిమైండర్‌గా పనిచేస్తుంది.ఏదైనా కొత్త వ్యాయామం లేదా ఆహార నియమావళిని ప్రయత్నించే ముందు అర్హత కలిగిన నిపుణుల నుంచి సలహా పొందడం ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube