స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ ను మీ సొంతం చేసే టాప్ అండ్ బెస్ట్ రెమెడీ ఇదే!

అసలే పెళ్లిళ్ల సీజన్ రాబోతుంది.మన ఇంట్లో పెళ్లయినా, బంధువుల పెళ్లి అయినా మనం అందరికన్నా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకోవడం చాలా సహజం.

ముఖ్యంగా స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్( Bright Skin ) కోసం తెగ ఆరాటపడుతుంటారు.అటువంటి చర్మాన్ని పొందడం కోసం బ్యూటీ పార్లర్ లో వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

రకరకాల క్రీములు ఉపయోగిస్తుంటారు.వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంది, ఎన్ని నష్టాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మాత్రం మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందడానికి అల్టిమేట్ గా వర్కోట్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు,( Milk ) చిటికెడు కుంకుమ పువ్వు( Saffron ) వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోండి.

Advertisement

ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్,( Badam Powder ) వన్ టీ స్పూన్ ఎర్ర కందిపప్పు పౌడర్, వన్ టీ స్పూన్ శనగపిండి, పావు టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకొని కలుపుకోండి.చివరిగా కుంకుమపువ్వు పాలు కూడా పోసి బాగా మిక్స్ చేసుకోండి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోండి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ చర్మంపై ఎటువంటి మచ్చలు ఉన్న మాయం అవుతాయి.

ఈవెన్ పిగ్మెంటేషన్ సమస్య సైతం తగ్గుముఖం పడుతుంది.

అలాగే ఈ రెమెడీ స్కిన్‌ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.టాన్ ను రిమూవ్ చేస్తుంది.చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది.

కెరియర్ స్టార్టింగ్ లో నాగ్ అశ్విన్ ఇంత కష్టపడ్డాడా..? ఆయన ఎంతైనా గ్రేట్ అబ్బా...
వైట్ స్కిన్ టోన్ కోసం ఆరాటపడే వారికి బెస్ట్ హోమ్ మేడ్ సీరం ఇది!

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యకు చెక్ పెడుతుంది.చర్మాన్ని బ్రైట్ గా మరియు బ్యూటిఫుల్ గా మెరిపిస్తుంది.

Advertisement

స్పాట్ లెస్ అండ్ బ్రైట్ స్కిన్ ను పొందాల‌నుకునేవారికి ఇది టాప్ అండ్ బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు