సూపర్ సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ ను( Shiny Hair ) పొందాలంటే సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.నిజానికి అటువంటి జుట్టును ఇంట్లోనే ఈజీగా పొందవచ్చు.
అందుకు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ కూడా ఆ కోవకు చెందిందే.
ఈ రెమెడీని పాటించడం ద్వారా పైసా ఖర్చు లేకుండా సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.
అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) లేదా రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి వేసుకోవాలి.అలాగే ఒక చిన్న కప్పు ఫ్రెష్ అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ షుగర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు నాలుగు టేబుల్ స్పూన్లు గంజి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.కలబందలో విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి పోషకాలు ఉంటాయి.అలాగే కొవ్వు ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాలు కూడా మెండుగా ఉంటాయి.
ఇవి జుట్టు పెరుగుదలను( Hair Growth ) పెంచడంతో పాటు జుట్టుకు చక్కని తేమను అందిస్తాయి.జుట్టును యూవీ డ్యామేజ్ నుండి కాపాడతాయి.

అలాగే అలోవెరా, చక్కెర, గంజి కురులను సూపర్ సాఫ్ట్ అండ్ షైనీ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.నిమ్మరసం చుండ్రు మరియు తల దురద నివారణలో తోడ్పడుతుంది.ఇక కరివేపాకు జుట్టును పటిష్టం చేయడానికి మరియు విరగడం రాలడం తగ్గించడానికి సహాయపడుతుంది.అంతేకాకుండా కరివేపాకు తెల్ల జుట్టు త్వరగా రాకుండా సైతం అడ్డుకుంటుంది.







