తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ( Anupama Parameswaran ) .ఈమె ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి అచ్చ తెలుగు అమ్మాయిగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అనుపమ పరమేశ్వరన్ ఇతర హీరోయిన్లతో పోలిస్తే కాస్త భిన్నం అనే చెప్పాలి.ఈమె సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరం తరచూ తన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఈమె చీర కట్టులో( Anupama Parameswaran Saree Photos ) ఎంతో అందంగా ఉంటారు ఇలా తరచూ చీర కట్టుకొని చేతినిండా గాజులు తల నిండా పువ్వులు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు ఈ ఫోటోలను కనుక చూస్తే ఈమె అచ్చే తెలుగు అమ్మాయి అనకమానరు.అలా తెలుగుదనం ఉట్టిపడేలా ఈమె ఉంటారనే చెప్పాలి.
ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది తెలుగు వాళ్ళు కూడా హీరోయిన్లుగా కొనసాగుతున్నారు అయితే మన తెలుగు అమ్మాయిలు ఇలా సంస్కృతి సంప్రదాయాలను పాటించడం మానేసి పాశ్చాత్య సంస్కృతిని( Western Culture ) ఇష్టపడుతున్నారు కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం తెలుగుదనం ఉట్టిపడేలా తరచూ తెలుగు పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈ విషయం గురించి పలువురు స్పందిస్తూ ఎంతో మంది తెలుగు హీరోయిన్స్ లో లేనటువంటి క్వాలిటీ అనుపమలో ఉన్నది ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు.అదే విధంగా ఈమె చూడటానికి అచ్చం తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు అమ్మాయిగా ఉండటంతో ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
ఇక పండుగల సందర్భాలలో చాలామంది హీరోయిన్స్ ఇలా తెలుగుదనం పుట్టిపడేలా సందడి చేస్తూ ఉంటారు అలాగే కొన్ని పద్ధతులను కూడా పాటిస్తూ ఉంటారు కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఏ సందర్భంలో తాను ఎక్స్పోజింగ్ చేయాలి ఏ సందర్భంలో గ్లామర్ షో( Anupama Parameswaran Glamor Show ) చేయాలి, ఏసందర్భంలో ట్రెడిషనల్ గా ఉండాలి అనే విషయాల గురించి బాగా ఆలోచిస్తారట ఇతర హీరోయిన్స్ అందరూ కూడా సినిమాల పరంగా డైరెక్టర్లు ఏది చెబితే అది చేస్తారు కానీ ఈమె మాత్రం ఈ షాట్ లో నేను ఎక్స్పోజింగ్ చేస్తే తనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనే విషయాన్ని గురించి ఆలోచిస్తారట ఇలా తనకు ఎక్స్పోజింగ్ చేయడం సరైనది అనిపిస్తే ఆ సన్నివేశానికి ఆమె అనుగుణంగా నటిస్తారని తెలుస్తోంది.ఏది ఏమైనా అనుపమ పరమేశ్వరన్ మాత్రం తన కెరియర్ పరంగా చాలా క్లారిటీగా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది.