సమంత జీవితంలో ఎప్పటికీ అది మిస్టరీనే.. చైతన్య గురించి బయటపెట్టదంటూ?

ఈరోజు స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.సమంత ఈ స్థాయికి చేరుకోవడంలో ఆమె కష్టం ఎంతో ఉంది.

 This Is The Shocking Mystery In Samantha Life Details Here , Mystery, Nagachaita-TeluguStop.com

మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్ స్టేటస్ తో పాటు విజయాలను అందుకున్నారు.నాగచైతన్య సమంత ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో గ్రాండ్ గా చైసామ్ ల వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత చైసామ్ అన్యోన్యంగా ఉండగా ఈ జోడీని చూసి అభిమానులు సైతం సంతోషించారు.

అయితే చైసామ్ ఎందుకు విడిపోయారనే ప్రశ్న మాత్రం అక్కినేని అభిమానులకు మిస్టరీ అని తెలుస్తోంది.చైతన్య సమంత మధ్య ఏదో గొడవ జరిగిందని ఆ గొడవ గురించి బయటపెట్టవద్దని సమంత భావిస్తున్నారని తెలుస్తోంది.

నాగచైతన్య ఇంటర్వ్యూలో వేర్వేరు ప్రశ్నలకు సమాధానాలను ఇస్తున్నా ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు.

సమంత విడాకులు తీసుకున్నా కెరీర్ విషయంలో మాత్రం మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సమంత రెమ్యునరేషన్ కూడా గత కొన్నేళ్లలో భారీగా పెరిగింది.సమంత 5 కోట్ల రూపాయల వరకు పారితోషికంను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

సమంత ఈ ఏడాది శాకుంతలం, యశోద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Telugu Mystery, Nagachaitanya, Samantha-Movie

ఈ రెండు సినిమాలలో ఒక్క సినిమా సక్సెస్ సాధించినా సమంత కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు.సమంత శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సమంత శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

సమంత బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టగా ఇతర హీరోయిన్లకు సమంత గట్టి పోటీ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube