తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ( Puri Jagannath )అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే తన తమ్ముడు అయిన సాయిరాం శంకర్( Sairam Shankar ) ని హీరో గా ఇండస్ట్రీ లో సెట్ చేయాలని చాలా వరకు ప్రయత్నం అయితే చేశాడు.
కానీ ఆయనకు పెద్దగా టాలెంట్ లేకపోవడంతో ఆయన హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.ఇక పూరి మాత్రం తన తమ్ముడిని హీరోగా చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.

అయితే సాయిరాం శంకర్ మిగతా హీరో లాగా సక్సెస్ అవ్వకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన నటనలో వైవిధ్యాన్ని చూపించలేడు, అలాగే డైలాగ్ డెలివరీలో కూడా అంత డిక్షనైతే ఉండదు.ఇక ఒక రకంగా చూసినట్టయితే ఆయన హీరో మెటీరియల్ కూడా కాదు అనే కారణాల చేతనే జనాలు అతన్ని రిజక్ట్ చేశారని చాలామంది చెప్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం పూరి రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాన్ ఇండియాలో మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక దీంతో కనక ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడితే పూరి నెక్స్ట్ స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.అయితే పూరి జగన్నాథ్ గత సినిమా అయిన లైగర్ ప్లాప్ తో ఆయనకి భారీ దెబ్బ పడింది.

దానివల్లే ఆయన ప్రస్తుతం స్టార్ హీరోలతో అవకాశాలను పొందలేకపోతున్నాడు.ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధించి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు…ఇక ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్ గా కూడా మారనుంది…ఇక ఈ సినిమాతో రామ్ కి కూడా మరో భారీ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు.







