సినిమా ఇండస్ట్రీ లో ఒక టైం వచ్చే వరకు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతూ ఉంటారు…ఒకసారి సక్సెస్ అయ్యాక హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమాయణం అనేది నడుస్తూ ఉంటుంది.ఇక ఈ ప్రాసెస్ కొందరు పెళ్లి చేసుకొని ఒకటవుతు ఉంటే మరికొందరు మాత్రం లవ్ కి బ్రేకప్ చెప్పి మళ్ళీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి కోవ కి చెందిన వారిలో కోలివుడ్ జంట ప్రభుదేవా నయనతార ఒకరు…వీళ్ళ మధ్య ప్రేమాయణం ఏ విధంగా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు…
ఇక నయనతార( Nayanathara ) తో పెళ్లి కోసం ప్రభుదేవా ఏకంగా తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకే విడాకులు ఇచ్చి నయనతారను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఎవరికి తెలియదు కానీ అనూహ్యంగా నయనతార ప్రభుదేవా మధ్య బ్రేకప్ జరిగింది…
అయితే నయనతార ప్రభుదేవా ( Prabhu Deva )మధ్య బ్రేకప్ జరగడానికి అసలు కారణం ఇదే అంటూ తాజాగా ఒక వార్తా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.అదేంటంటే.నయనతార ప్రభుదేవా ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన టైంలో ప్రభుదేవా తన మొదటి భార్య రమాలత కి విడాకులు ఇచ్చి తన ఇద్దరు కొడుకులను తనతో తీసుకువచ్చుకున్నాడట…
కానీ కొడుకుల విషయంలో నయనతార ప్రతిసారి గొడవ పడుతూ తన కొడుకులని దూరం పెట్టమని ప్రభుదేవా తో గొడవ పెట్టుకునేదట.కానీ కొడుకులను వదులుకోలేక ప్రభుదేవా చివరికి నయనతార తో బ్రేకప్ చెప్పుకున్నాడట.అలా ప్రభుదేవా నయనతార మధ్య బ్రేకప్ అవ్వడానికి ప్రభుదేవా మొదటి భార్య కొడుకులు కారణమయ్యారట…ఇలా వీళ్లిద్దరి మద్య కొన్ని విభేదాలు రావడం తో ఇద్దరు విడిపోయారు దాంతో నయన తార డైరెక్టర్ విఘ్నేష్ శివన్( Vignesh Shivan ) ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు…
.