నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ కి ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే వరుసగా మాస్ సినిమాలు చేస్తూ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.
ఒక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో ఒక పెను సంచలనంగా మారేది.
ఇక ముఖ్యంగా ఆది, సింహాద్రి( Aadi , Simhadri ) సినిమాలు తనని ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చాయి.ఇక ఈ సినిమాలు ఇచ్చిన సక్సెస్ తో తను ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు.ఇక అందులో భాగంగానే ఎన్నో వైవిధ్యమైన పాత్రలను కూడా పోషిస్తూ వచ్చాడు.
మొదట్లో తను మాస్ హీరోగా చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే అప్పటికే వాళ్ళ బాబాయ్ అయిన బాలకృష్ణ( Balakrishna ) వరుసగా ఫ్యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.తను కూడా అదే మాదిరిగా మాస్ లో మంచి గుర్తింపును సంపాదించుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.
కాబట్టి తను కూడా అదే రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకొచ్చాడు.
ఇక మొత్తానికైతే తనను తాను స్టార్ హీరోగా మలుచుకున్నాడు.ఇక తన మొదట్లో మాస్ సినిమాలు చేయడం వల్ల ఆ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను చేస్తూ తన మార్కెట్ ని భారీగా డౌన్ చేసుకున్నాడు.ఇక అలాంటి క్రమంలోనే తనకంటూ ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ డిఫరెంట్ వే లోకథలను ఎంచుకుంటూ ముందుకు సాగాడు.
దానివల్లే ప్రస్తుతం ఆయనకు ఇప్పుడు మంచి సక్సెస్ లు వస్తున్నాయి… చూడాలి మరి ఎన్టీయార్ ఫ్యూచర్ లో ఎన్ని శిఖరాలను అదిరోహిస్తాడు అనేది…