తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నిర్వహించిన విలేఖరుల సమావేశం బీజేపీ కేంద్రంగానే సాగిందన్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కరలేదు.అయితే కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా సంచలనం రేగడమే కాకుండా సరికొత్త చర్చలకు దారితీస్తున్న పరిస్థితి ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న పరిస్థితి ఉంది.మొత్తం కేసీఆర్ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పేరును ఏ మాత్రం ప్రస్తావించకపోవడానికి, కాంగ్రెస్ ను విమర్శించకపోవడానికి భవిష్యత్ లో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నదని అందుకే కాంగ్రెస్ ను విమర్శించలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
అయితే ఈ ప్రచారం పట్ల కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి కాని ఇతర కాంగ్రెస్ నాయకులు ఏ మాత్రం స్పందించని పరిస్థితి ఉంది.
బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించడమే కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యమని కాని కాంగ్రెస్ ను ప్రస్తావించకపోవడానికి పొత్తు పెట్టుకోబోతున్నదనే ప్రచారంలో వాస్తవం లేదని టీఆర్ఎస్ నాయకులు అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా బీజేపీ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చాలా రోజులు కొనసాగే అవకాశం ఉండనున్నట్లు ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ ను కేసీఆర్ ను అంతగా పట్టించుకునే పరిస్థితి లేదు.ఎందుకంటే కాంగ్రెస్ ప్రస్తుతం తమలో తామే అంతర్గత పొరుతో సతమతమవుతున్న పరిస్థితి ఉంది.కావున కాంగ్రెస్ వల్ల బీజేపీకి ఏదో నష్టం జరుగుతుందని కేసీఆర్ భావించే అవకాశం లేదు.
ఏది ఏమైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఎంత వరకు వాస్తవమనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.