అసలైన ఫ్రెండ్షిప్ అంటే ఇదే.. ఐఏఎస్ అధికారి వీడియో సూపర్ వైరల్!

ప్రేమదేశం సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్‌ మధ్య నెలకొన్న స్నేహం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇలాంటి ఫ్రెండ్షిప్ నిజమైన వ్యక్తుల మధ్య చూడటం చాలా అరుదు.

 This Is The Real Friendship Ias Officer Video Super Viral , Friendship, Viral-TeluguStop.com

నిజానికి పుట్టిన సమయం నుంచే ప్రేమ, ఆప్యాయతలతో నిస్వార్ధంగా స్నేహం చేసే లక్షణాలు మనకి వస్తాయి.కానీ ఈ ప్రపంచం ఆ సుగుణాలను చంపేసి స్వార్ధ పూరితంగా మార్చి నిజమైన స్నేహితుడిని మాయం చేస్తుంది.

ఇదే విషయాన్ని తాజాగా ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చారు.ఒక వీడియోని ఇందుకు ఉదాహరణగా కూడా షేర్ చేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

“ప్రేమతోనే మనం పుడతాం.కానీ ద్వేషం అనేది మనం నేర్చుకుంటాం.” అని ఈ వీడియోకి అవనీష్ శరణ్ ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియోలో వరుసగా మూడు కుర్చీలలో ముగ్గురు పిల్లలు కూర్చోవడం చూడొచ్చు.వీరిలో ఇద్దరు పిల్లలు ముచ్చట్లు పెట్టుకుంటుండగా మూడో పిల్లవాడు ముంచుకొస్తున్న నిద్రను అతికష్టం మీద ఆపుకుంటూ ఉన్నాడు.

సపోర్టు లేకపోవడంతో అటు ఇటు జోగుతూ మళ్లీ నిద్ర లేస్తూ చాలా ఇబ్బంది పడి పోతున్నాడు.అయితే పక్కనే ఉన్న మరొక బాలుడు నిద్ర మత్తులో ఉన్న ఈ బాలుడి హాయిగా నిద్రించేందుకు తన భుజాన్ని సపోర్టుగా అందించాడు.

అలా అతడు పడుకోవడానికి మరో బాలుడు హెల్ప్ చేశాడు.

సాధారణంగా ఎవరికైనా బాగా నిద్ర వస్తే పక్కన వారు స్నేహితులైన తమపై తలపెట్టుకునివ్వరు.

పక్కకి నెట్టి వేస్తారు అలాగే వారిపై జోకులు కూడా పేల్చుతారు.కానీ ఈ చిన్న పిల్లాడు మాత్రం అలా చేయకుండా తనలోని ప్రేమను చాటాడు.అందుకే దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.“సార్‌, మీరు చెప్పినట్టే ప్రేమ అనేది సహజంగా వచ్చేది.ద్వేషం అనేది అసహజమైనది.ఈ పాపిష్టి స్వభావాన్ని మనిషే సృష్టించాడు.” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube