తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి లక్షల కోట్ల మంది విచ్చేస్తుంటారు.
అయితే వీరందరికీ సరైన సౌకర్యాలు అందించేందుకు సరిపడా ఉద్యోగులు అందుబాటులో ఉండటం తప్పనిసరి.అలాగే తాత్కాలిక ఉద్యోగుల్లో అభద్రతా భావం తొలగించడమూ ముఖ్యమే.
ఈ విషయంలో ఇప్పటివరకు సమాలోచనలు చేసిన టీటీడీ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఇది ఔట్-సోర్సింగ్ ఉద్యోగుల కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏపీసీఓఎస్ అనే కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను చెల్లిస్తోంది.అయితే ఇప్పుడు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ తరహాలో అలాంటి సొసైటీనే ఏర్పాటు చేసింది టీటీడీ.
దీని ద్వారా కాంట్రాక్టు, ఔట్-సోర్సింగ్ ఉద్యోగులకు భద్రతా భావం కలిగించనుంది.అయితే తమను ఇలా ఒక ప్రత్యేకమైన సొసైటీలో చేర్చడం వల్ల పే స్కేల్ వంటి కోరికలు నెరవేరే సూచనలు కనిపించడం లేదని ఉద్యోగులు భావిస్తున్నారట.

అందుకే ఏపీ ప్రభుత్వం నిర్ణయం పై కోర్టుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇది ఇలా ఉండగా ఇకపై టీటీడీలోని ఏజెన్సీలు, ఇతర సంస్థలకు కొత్తగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించడానికి వీల్లేదని.గడువు ముగిసిన కాంట్రాక్టులను కూడా పొడిగించరాదని టీటీడీ ఈవో కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అయితే టీటీడీ ఉద్యోగుల విషయంలో ఎప్పటినుంచో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ లో
వైసీపీ ప్రభుత్వం
ఏర్పాటు అయిన తర్వాత ఆ సమస్యలు తొలగిపోతాయని కాంట్రాక్ట్ ఉద్యోగులు భావించారు.
కానీ ఇప్పటికీ వారి సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు అన్నట్లు వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.