త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పని చేశారు.ఆయన అదే టైంలో చాలా స్క్రిప్ట్ లకు డైలాగులు కూడా రాసేవారు.
ఇక ఆయన మొదట డైలాగ్ రైటర్ గా నిన్నేప్రేమిస్తా ( Ninne Premistha )అనే సినిమాకి పనిచేశారు.దాని తర్వాత విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన నువ్వేకావాలి సినిమాకి డైలాగ్స్ రాశారు.
ఇక ఆ తర్వాత వేణు తొట్టంపూడి హీరోగా వచ్చిన స్వయంవరం అనే సినిమాకి కథ, మాటలు ఇవ్వడం జరిగింది.ఇక అక్కడి నుంచి త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు ముఖ్యంగా విజయ్ భాస్కర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.

వచ్చిన ప్రతి సినిమా హిట్ సినిమా గానే నిలిచింది.అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ కి మంచి పేరు ఉండేది.ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ నువ్వే నువ్వే ( Nuvve Nuvve )సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ సినిమా యావరేజ్ గా ఆడింది దాంతో మహేష్ బాబు హీరోగా అతడు అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా యావరేజ్ గా ఆడింది.
నెక్స్ట్ పవన్ కళ్యాణ్ హీరోగా జల్సా అనే సినిమా చేశాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక అక్కడి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరితో వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) గురించి చెప్పినప్పుడు స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్ , డైరెక్టర్ అని మాత్రమే చెప్తారు.కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన కెరియర్ లో ఒక సినిమాకి సాంగ్స్ కూడా రాశారు.ఆ సినిమా ఏంటి అంటే రవితేజ నమిత హీరో హీరోయిన్లుగా వచ్చిన ఒక రాజు ఒక రాణి సినిమాకి( Oka Raju Oka Rani Movie ) త్రివిక్రమ్ సాంగ్స్ రాయడం జరిగింది.ఈయన పాటలు రాసిన మొదటి సినిమా లాస్ట్ సినిమా కూడా ఇదే…ఆ తర్వాత ఆయన లిరిక్ రైటర్ గా ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అని అడిగితే నాలుగైదు పాటలు రాసిన తర్వాత కొత్తగా తాట్స్ ఏం రావట్లేదు అవే వర్డ్స్ రిపీటెడ్ గా వస్తున్నాయి అందువల్ల నేను రాయడం ఆపేసాను అని చెప్పారు…
.