తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నారు.ఇక ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఎన్ని సక్సెస్ లు కొట్టినా కూడా వాళ్లకు అచ్చిచ్చోన కాంబినేషన్ ఒకటి ఉంటుంది.
ఆ డైరెక్టర్ తో సినిమా తీసినప్పుడు పక్కాగా ఆ సినిమా సక్సెస్ సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో అయితే ఆ హీరో ముందుకు కదులుతూ ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య, బోయపాటి ( Balayya, Boyapati )కాంబినేషన్ కు చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా దాదాపు సూపర్ సక్సెస్ సాధిస్తుంది అనే అంచనాలైతే క్రియేట్ చేసుకున్నారు.ఇక ఈ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ ను సాధించడం తో బెస్ట్ కాంబినేషన్ లో వచ్చే సినిమాగా వీళ్ళ కంబోను మనం ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో నాలుగో సినిమా కూడా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే ఈ సినిమాలో బాలయ్య బాబు ఆర్మీ ఆఫీసర్( Army officer ) గా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో బాలయ్య ను బోయపాటి నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇప్పటివరకు మూడు సినిమాల్లో బాలయ్యని టాప్ లో చూపించిన బోయపాటి ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు ఇక ఇప్పుడు చేయబోయే సినిమా బోర్డర్లో జరిగే ఒక వార్ ఎపిసోడ్ కు సంబంధించిన సినిమాగా దీన్ని మలచబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక అదే జరిగితే బాలయ్య బాబు ఆర్మీ సోల్జర్ గా తన ప్రతాపం ఏంటో చూపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో బాలయ్య బాబు అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు…
.







