అత్యధికంగా సేల్ అవుతున్న ఎలక్ట్రిక్ కారు ఇదే.. ఒకసారి ట్రై చేస్తారా?

టెస్లా కంపెనీ( Tesla Companey ) గురించి వినియోగదారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు( Tesla electric cars ) మార్కెట్లో వున్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే.

 This Is The Most Selling Electric Car Will You Try It Once Details, Latest News,-TeluguStop.com

ఈ కంపెనీ అందించే ఫీచర్లు, పర్ఫార్మెన్స్ ఆయిల్ ఆధారిత వెహికల్స్ కంటే మెరుగ్గా ఉంటాయని వినికిడి.ఈ క్రమంలో టెస్లా కంపెనీ నుండి వచ్చిన మోడల్ YSUV ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.

తాజాగా ఈ కారు ఒక అరుదైన ఫీట్ సాధించింది.ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ కారుగా టెస్లా మోడల్ Y ( Tesla Model-Y )ఇప్పుడు అవతరించింది.

ఈ మైలురాయిని సాధించిన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్‌గా ఇది చరిత్ర సృష్టించిందని చెప్పుకోవాలి.మోడల్ వై అనేది ఒక మిడ్-సైజ్డ్ క్రాస్ఓవర్.అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాపులర్ అయింది.ఓ తాజా రిపోర్ట్ ప్రకారం, 2023 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన కారుగా టెస్లా మోడల్ వై రికార్డు సృష్టించింది.

సేల్స్‌లో టయోటా RAV4, కరోలా (Corolla) మోడల్స్‌ను సైతం ఈ టెస్లా కారు అధిగమించడం కొసమెరుపు.

ఈ వై కారు $ 47,490 (దాదాపు రూ.39 లక్షలు) డాలర్ల ప్రారంభ ధరతో మార్కెట్లో అందుబాటులో వుంది.ఇక ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో టెస్లా మోడల్ Y ప్రపంచవ్యాప్తంగా 2,67,200 యూనిట్లను విక్రయించింది.2021లో మోడల్ వై ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించనుందని మాస్క్ ఆనాడే అంచనా వేశారు.కాగా నేడు అది నిజమవ్వడం అతని దూరదృష్టికి తార్కాణం అని చెప్పుకోవాలి.

యూఎస్ మార్కెట్‌ వాటాలో సగం టెస్లాదే కావడం గమనార్హం.టెస్లా ఇతర 17 ఆటోమోటివ్ గ్రూపుల కంబైన్డ్ సేల్స్ కంటే ఎక్కువ కార్లను విక్రయిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube