దేశ రాజకీయాల్లో చక్రం తిప్పలని ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్( BRS ) అధినేత ,తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) దానికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.అలాగే పెద్ద ఎత్తున చేరుకలు ఉండే విధంగా సభలు , సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్రలో ఇప్పటికే మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించి సక్సెస్ చేశారు.అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించి బిఆర్ఎస్ పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ కు రాజకీయంగా అవకాశం ఉంటుందని భావిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ( Andhra Pradesh ) కూడా ఉంది. ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ కు రాజకీయంగా ఛాన్స్ ఉంటుందని భావిస్తున్న కెసిఆర్ దీనిలో భాగంగానే ఆ పార్టీ రాష్ట్ర శాఖను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమించారు.ఇంత వరకు బాగానే ఉన్నా, ఆశించిన స్థాయిలో అయితే బీఆర్ఎస్ లోకి చేరికలు కనిపించకపోవడం ఆ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.

ఏపీ బీఆర్ఎస్ లో తోట చంద్రశేఖర్ , మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వంటి కొద్దిమంది నేతలు తప్ప, పేరు ఉన్న నేతల ఎవరు లేకపోవడం, పెద్దగా చేరికలు నమోదు కాకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఇటీవలే గుంటూరులో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరవుతారని అంతా భావించినా, ఆ కార్యక్రమాన్ని సింపుల్ గానే ప్రారంభించేశారు.మంత్రి కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు హాజరు కాలేదు.
తోట చంద్రశేఖర్ ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు హోదాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఇక ఎప్పటి నుంచో ఏపీలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తారని , ఈ సభకు కేసిఆర్ హాజరవుతారని , అప్పుడు పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని చెబుతూనే వస్తున్న, అది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.

దీంతో చేరికలు లేక , ఏపీలో పార్టీని ముందుకు తీసుకు వెళ్ళేందుకు విధివిధానాలు లేకపోవడం వంటి కారణాలతో పూర్తిగా సైలెంట్ ఇక్కడి నేతలు సైలెంట్ అయిపోయారు.ప్రస్తుతం ఏపీలో సీఎంగా ఉన్న జగన్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడ కావడం, 2019 ఎన్నికల్లో వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చే విధంగా కేసీఆర్ సహకారం అందించడం, ఇప్పుడు ఏపీ రాజకీయాలలో బిఆర్ఎస్ కీలకంగా మారితే జగన్ కు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనతో కేసీఆర్ సైలెంట్ అయ్యారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కేసిఆర్ అంచనా వేసినట్టుగా మిగతా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉన్నా, ఏపీలో మాత్రం అంత ఛాన్స్ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఏపీలో పార్టీ ఎదుగుదలపై సర్వే చేయించుకున్న కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండదు అనే నివేదికలు అందడంతోనే సైలెంట్ అయ్యారని, తెలంగాణలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ రాజకీయాలు పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని బిఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.







