2022లో ది బెస్ట్ అవార్డ్‌ గెలిచిన ఐఫోన్‌ ఇదే... ఇతర అవార్డుల ఫోన్లు ఇవే!

iPhone గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.Apple Inc తయారుచేసిన ఈ ఫోన్ ఇపుడు లోకమంతటా అమ్ముడుపోతుంది.

 This Is The Iphone That Won The Best Award In 2022 These Are The Phones That Won-TeluguStop.com

మొదటి తరం ఐఫోన్‌ను అప్పటి-ఆపిల్ CEO అయినటువంటి స్టీవ్ జాబ్స్ జనవరి 9, 2007న రిలీజ్ చేయడం జరిగింది.అప్పటి నుండి, ఆపిల్ ఏటా కొత్త ఐఫోన్ మోడల్‌లు మరియు iOS అప్‌డేట్‌లను విడుదల చేసి ప్రపంచ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోనే అగ్రగామిలా నిలిపారు.2022 నాటికి, ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాలో ఐఫోన్ 15.6% వాటాను కలిగి ఉందని మీకు తెలుసా?.

ఇకపోతే, రేపటితో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్న తరుణంలో 2022లో ది బెస్ట్ అవార్డ్‌ గెలిచిన ఐఫోన్‌ గురించిన వివరాలు సదరు కంపెనీ వెల్లడించింది.గత 12 నెలల కాలంలో మార్కెట్లోకి అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవాలి.

ఈ సంవత్సరం ఐఫోన్ 14 సిరీస్‌ రిలీజ్‌ అయింది.అయితే ఎక్కువ మంది ప్రో మోడల్స్‌పై ఆసక్తి చూపారు.

శామ్‌సంగ్ సరికొత్త గెలాక్సీ ఎస్ 22 అల్ట్రాను లాంచ్‌ చేసింది.అలాగే నథింగ్ ఫోన్ మార్కెట్‌కి కొత్త డిజైన్ ని పరిచయం చేసింది.

అయితే వీటిలో బెస్ట్‌ ఏదన్న విషయమై ఓ సర్వే జరగగా నిపుణులు ఎప్పట్లాగే ఐఫోన్ ని ప్రకటించారు.అవును… ప్రతి సంవత్సరం మాదిరిగానే ఐఫోన్‌లు మార్కెట్లో బెస్ట్ కెమెరా అవార్డ్‌ను సొంతం చేసుకున్నాయి.ఐఫోన్‌ 14 ప్రో(iPhone 14 Pro) ఈ విభాగంలో అన్నింటికంటే ముందుంది.కొందరు గూగుల్‌ పిక్సెల్‌ 7 ప్రో కెమెరాలకు ఓటు వేశారు కానీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల కంటే, ఐఫోన్‌లు వీడియో రికార్డింగ్ సామర్థ్యంలో మార్కులు కొట్టేస్తాయి.

అలాగే ఈ ఏడాది నథింగ్ ఫోన్ అద్భుతమైన డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్‌ ఫోకస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది అనడంలో అతిశయోక్తి లేదు.కానీ అమ్మకాల విషయంలో మాత్రం కాస్త వెనకబడిపోయిందనే అనుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube