చరణ్ ఉపాసన గొప్ప మనస్సుకు నిదర్శనమిదే.. డ్రైవర్ కోసం అలా చేయడంతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నా ఆ హీరోలలో రియల్ హీరోలు ఎంతమంది అనే ప్రశ్నకు చాలా తక్కువమంది ఉన్నారనే సమాధానం వినిపిస్తుంది.అయితే ఆ రియల్ హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరని చెప్పవచ్చు.

 This Is The Greatness Of Upasana And Ram Charan Details Here ,upasana , Ram Char-TeluguStop.com

చరణ్ పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఎంతగానో గౌరవిస్తారనే సంగతి తెలిసిందే.చరణ్ తన దగ్గర పని చేసేవాళ్లను కూడా ఎంతో బాగా చూసుకుంటారు.

తాజాగా చరణ్ తన డ్రైవర్ పుట్టినరోజు సందర్భంగా డ్రైవర్ తో కేక్ కట్ చేయించారు.డ్రైవర్ పుట్టినరోజు వేడుకల్లో ఉపాసన కూడా పాల్గొన్నారు.డ్రైవర్ కోసం సమయం కేటాయించి అతనితో కేక్ కట్ చేయించారంటే చరణ్ ఉపాసన ఎంతో గ్రేట్ అని వాళ్ల మంచి మనస్సుకు ఈ ఘటన నిదర్శనమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చరణ్ డ్రైవర్ పేరు నరేష్ కాగా చరణ్ చేసిన పనికి డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందు వచ్చిన చరణ్ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.చరణ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాపై కూడా బాగానే అంచనాలు నెలకొన్నాయి.చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి.

చరణ్ ఈ సినిమాలతో విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Charan Naresh, Greatness, Ram Charan, Upasana-Movie

చరణ్ సుకుమార్ కు కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే ఈ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ సినిమాలో సీన్లు ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటాయని తెలుస్తోంది.

కొత్తదనంతో కూడిన సీన్లతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube