సినిమా ఇండస్ట్రీ లో చాలామంది నటులు ఉంటారు.ప్రస్తుతం సీనియర్ నటులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్లలో ముఖ్యమైన నటులు గా ఉన్న గుళ్లపూడి మారుతీ రావు, కైకాల సత్యనారాయణ,( Kaikala Satyanarayana ) జగ్గయ్య లాంటి నటులు అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా, విలన్లు గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వీళ్ల విలనిజం చాలా బాగుండేది.ఇక అలాగే అనవసరపు పోకడలకు పోకుండా ఆ క్యారెక్టర్ ఎంత మాట్లాడితే బాగుంటుంది లాంటి వాటితో డైరెక్టర్లు కూడా మంచి క్లారిటీ గా ఉండి మంచి సినిమాలు తీసేవారు…
అప్పట్లో షూటింగ్ స్పాట్ లో మానిటర్లు కూడా ఉండేవి కావు అయిన కూడా డైరెక్టర్లు ఏ షాట్ ఓకే అయింది ఏ షాట్ ఒకే అవలేదు లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ తో మంచి సినిమాలు తీసి సక్సెస్ సాధించేవారు నిజానికి వీళ్లు అందరు కూడా మంచి ఫిలిం మేకర్స్ అయినప్పటికీ అప్పట్లో ఉన్న టెక్నాలజీ ని వాడుకొని వాళ్ళు సినిమాలు తీసేవారు…అప్పట్లో ఉన్న నటులు మంచి నటులు గా పేరు సంపాదించుకున్నారు అంటే అందులో అప్పటి డైరెక్టర్ల గొప్పతనం చాలా ఉంది.
ఇక ప్రస్తుతం ఉన్న విలన్లు చాలా డేంజర్ గా స్క్రీన్ మీద కనపడుతున్నారు.డైరెక్టర్లు( Directors ) వాళ్ళకి అనవసరపు బిల్డప్ లు, అనవసరపు హైప్ లు ఇస్తూ చాలా క్రూయల్ గా చూపిస్తున్నారు.ఇక ఇప్పుడు ఉన్న డైరెక్టర్లకి సరిగ్గా క్లారిటీ ఉండదు ఒకటి చెప్పి ఒకటి తీస్తారు అందుకే ఈ జనరేషన్ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లకి ఒక విజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు గా తీయడమే కాకుండా విలన్ల పాత్రలో హింస ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటున్నారు.
ఇక ఈ విషయం లో డైరెక్టర్లదే తప్పు అని చాలా మంది వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో తెలియదు ఏం చేయాలో క్లారిటీ ఉండదు ఇలా చేసే చాలా మంది ఎదో ఒకటి చేస్తున్నారు…
.