కేసీఆర్‌కు ముందున్న అస‌లు సినిమా ఇదే ?

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన తెలంగాణ రాజ‌కీయాలు వేరు.ఇక ముందు చూడ‌బోయే తెలంగాణ రాజ‌కీయాలు వేరు!- ఇదీ ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప్ర‌తి ఒక్క‌రూ చెబుతున్న మాట‌.

 This Is The Cinema Which Will Be Infront Of Kcr,telangana,kcr,ktr,bjp,political-TeluguStop.com

ఇటీవ‌ల ముగిసిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు దాదాపు వ‌చ్చేసిన‌ట్టే.వీటిని ప‌రిశీలించిన విశ్లేష‌కులు.

ఇక‌, కేసీఆర్‌.ఆయ‌న కుటుంబం ఇక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌పై పెత్త‌నాన్ని దాదాపు కోల్పోయిన‌ట్టేన‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు, మున్ముందు కూడా కేసీఆర్‌కు రాష్ట్ర రాజ‌కీయాలు న‌డ‌ప‌డం అంత ఈజీ కాద‌ని కూడా అంటున్నారు.నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌.

రాష్ట్రంలోతాను త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెబుతూ వ‌చ్చారు.ఈ క్ర‌మంలో నే నాయ‌కుల‌ను , పార్టీల‌ను కూడా ఆయ‌న పెద్ద‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండానే వ్య‌వ‌హ‌రించారు.

కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేశారు.

అయితే, అనూహ్యంగా కేసీఆర్‌కు మైన‌స్ మార్కులు ప‌డుతున్నాయి.

ఆయ‌న పాల‌న‌కు కూడా భారీ ఎత్తున మైన‌స్ మార్కులే క‌నిపిస్తున్నాయి.ఇటీవ‌ల జ‌రిగిన దుబ్బాక ఎన్నిక‌ల్లోనూ, ఇప్పుడు జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిక‌ర ప‌రిణామాల్లోకి జారిపోయింది.

ఎక్క‌డైనా.కేసీఆర్‌.

దూకుడు క‌నిపించిందా? అని త‌ర‌చి చూసినా ఎక్క‌డా క‌నిపించ‌లేదు.ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు సొయిలోనే లేద‌ని అనుకున్న బీజేపీ.

కేసీఆర్‌కు నిద్ర లేకుండా చేస్తోంది.దుబ్బాక‌లో విజ‌యం త‌ర్వాత ఆ పార్టీ ఇప్పుడు గ్రేట‌ర్‌లో పుంజుకున్న తీరు చూస్తే రాబోయే అసెంబ్లీ ఫ‌లితాలు కూడా క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.

వాస్త‌వానికి గ‌తంలో జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో కేవ‌లం 4 డివిజ‌న్ల‌ను మాత్రమే బీజేపీ ద‌క్కించుకుంది.

Telugu Ghmc, Kavitha, Kcr, Latest, Telangana-Telugu Political News

అయితే, ఇప్పుడు ఏకంగా 48 కు చేరుకోవ‌డం.కీల‌క‌మైన డివిజ‌న్ల‌ను సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న డివిజ‌న్ల‌ను కూడా త‌న ఖాతా లో వేసుకోవ‌డం వంటివి టీఆర్ ఎస్ ఫ్యూచ‌ర్‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.అంతాత‌న‌దేన‌ని.

తెలం గాణ మొత్తం తానే పాలించాల‌ని.త‌న కుటుంబ‌మే రాష్ట్రంలో పైచేయి సాధించాల‌ని.

ఇలా కేసీఆర్ వ్యూహాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో బీజేపీ స‌క్సెస్ అయింది.అదే స‌మ‌యంలో బీజేపీ తాజాగా ప‌గ్గాలు చేప‌ట్టిన బండి సంజ‌య్ దూకుడు బాగానే వ‌ర్కువు ట్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

దీనికి తోడు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం కూడా తెలంగాణ‌పై ఇక మీద‌ట మరింత తీవ్రంగా దృష్టి పెట్ట‌నుంది.ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.కేసీఆర్‌కు ఇప్పుడున్న యాక్స‌స్ ఇక‌పై ఉండే అవ‌కాశం లేదు.ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఊహించుకున్న ఓట‌రు వేరు.

మున్ముందు చూడ‌బోయే ఓట‌రు వేరు! అంటున్నారు ప‌రిశీల‌కులు.మొత్తానికి తెలంగాణ యోధుడికి మున్ముందు అగ్నిప‌రీక్షే అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube