టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఇకపోతే ఈ సినిమాని ఆగస్టు 25వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేశారు.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరొక అప్డేట్ విడుదల చేశారు.
ఈ క్రమంలోనే లైగర్ సినిమా నుంచి విజయ్ దేవరకొండ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా ఉన్నటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ ఈ స్టిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సినిమా కోసం మానసికంగా శారీరకంగా నా సర్వస్వం మొత్తం పెట్టి నటించాను.నా కెరియర్ లో బెస్ట్ చాలెంజింగ్ రోల్ ఇదే అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా లైగర్ నుంచి విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇక ఈ పోస్టర్ చూసిన ఎంతోమంది నెటిజన్లు ఈ పోస్టర్ అచ్చం అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా పోస్టర్ ను తలపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.ఇప్పటికే భారీ అంచనాలను పెంచిన ఈ సినిమా థియేటర్లో ఎలా ప్రేక్షకులను సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది.