బాహుబలి సినిమాలో జక్కన్న ఫేవరెట్ రోల్ ఇదే.. ఆ పాత్ర అంటే ఇంత ఇష్టమా?

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు రాజమౌళి.

కాగా ఇప్పటివరకు ఆయన 12 సినిమాలు తెరకెక్కించగా ఆ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఒకదాన్ని మించి ఒకటి రికార్డుల మోత మోగించాయి.

అలాగే తెలుగు చిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత జక్కన్నదే అని చెప్పాలి.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం వహించిన సినిమాలో బాహుబలి సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా ఆయన క్రేజ్ ని పెంచడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ లో చాటి చెప్పింది.రెండు భాగాలుగా వచ్చిన ఈ మూవీ కోసం రాజమౌళి నిర్మాతల చేత ఏకంగా నాలుగు వందల కోట్లు ఖర్చుతో ఈ సినిమాను నిర్మించారు.ఆ సంగతి అటు ఉంచితే మొదట ఈ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి కాస్త వెనుకడుగు వేశారట.

Advertisement

ఆ సమయంలో ప్రభాస్ రాజమౌళికి అండగా నిలిచారట.కాగా బాహుబలి సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.

వీటన్నింటిలో దేవసేన పాత్ర ( Devasena )అంటే రాజమౌళికి ఎంతో ఇష్టమట.ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు దర్శకుడు రాజమౌళి.ఇకపోతే జక్కన్న సినిమాల విషయానికి వస్తే.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాతో తెలుగు సినిమాకియా అనే మరింత పెంచుతాడని, తప్పకుండా ఆ సినిమా సంచలన విజయం సాధిస్తుందని మహేష్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.

జిమ్, సర్జరీ లేకుండా 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్.. ఎలా సాధ్యమైందంటే?
Advertisement

తాజా వార్తలు