కొండచిలువలు చాలా బలంగా ఉంటాయి.అలాగే చాలా పెద్దగా ఉంటాయి.
ఇవి మనుషులను కూడా చంపేసి అమాంతం మింగేయగలవు.అందుకే వీటిని పట్టుకోవడానికి ఎవరూ కూడా ధైర్యం చేయరు.
అయితే తాజాగా కొండచిలువను ఎలా ఈజీగా పట్టుకోవాలో చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఓ భారీ కొండచిలువ కోడి పిల్లని తినడానికి వచ్చి ఉచ్చులో పడిపోయింది.
అలా సింపుల్ గా దీనిని కొందరు పట్టేసుకున్నారు.ప్రముఖ ట్విట్టర్ పేజీ ‘ఓడ్లీ టెర్రిఫైయింగ్’ (OddIy Terrifying) షేర్ చేసిన ఈ వీడియోకి 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక నీటి కాలువలో ఉచ్చును ఉంచడం చూడవచ్చు.దాని ముందే ఒక కోడి పిల్లను పెట్టారు.ఆ కోడి పిల్లను తినాలని కొండచిలువ ప్లాస్టిక్ పైపు గుండా దూసుకెళ్లింది.పైపులో తల ఉంచింది.
అయితే ఆ పైపులోకి పాము వెళ్ళగానే ఉచ్చు ఒక్కసారిగా పడిపోయింది.దాంతో పాముకి తాను ఉచ్చులో ఇరుక్కున్న విషయం తెలిసింది.
దాన్నుంచి పాము విడిపించుకోవడానికి బలవంతంగా అటు ఇటు కదులుతూ ప్రయత్నించింది.కానీ అది కదులుతున్న కొద్దీ ఉచ్చు అనేది మరింత బలంగా పడింది.
అలా ఈ కొండచిలువ ఈజీగా దొరికిపోయింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ ఐడియాను పొగుడుతున్నారు.
ఆలోచన చేస్తే ఎంత పెద్ద పామునైనా ఇట్టే పట్టుకోవచ్చని ఈ వీడియో నిరూపిస్తున్నట్లు కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.ఇది మామూలు ట్రాప్ కాదని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.







