తెలుగు రాజకీయాలలో కొడాలి నాని( Minister Kodali Nani ) పేరు తెలియని వారు ఎవరు ఉండరు.గుడివాడ నియోజకవర్గం నుండి దాదాపు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని.
జగన్( YS Jagan ) ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి దశలో మంత్రిగా రాణించారు.తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన గాని వైయస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) మరణించాక జగన్ వెంట నడిచారు.
జగన్ అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి వైసీపీకి మద్దతు తెలిపిన తొలి ఎమ్మెల్యే కొడాలి నాని.అప్పటినుండి రాజకీయంగా వైయస్ జగన్ వెంట ఎంతో నమ్మకంగా వెన్నంటే నడుస్తున్నారు.
వైసీపీ పార్టీని ప్రత్యర్థులు ఎవరైనా విమర్శిస్తే దీటుగా జవాబు కౌంటర్ ఇవ్వడంలో కొడాలి నాని స్టైలే వేరు.

ముఖ్యంగా చంద్రబాబు( Chandrababu Naidu ), నారా లోకేష్ కి ఊహించని రీతిలో కౌంటర్లు ఇస్తుంటారు.వైయస్ జగన్ సైతం తాను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అసెంబ్లీ సమావేశాలలో ఒకసారి తనకు అత్యంత నమ్మకస్తులలో కొడాలి నాని ప్రథముడు అన్ని సంచలన స్పీచ్ ఇవ్వడం జరిగింది.ఇదిలా ఉంటే 2024 ఎన్నికలలో కూడా గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నాని పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో విస్తృతంగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.తాజాగా కొడాలి నాని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇవే తనకి చివరి ఎన్నికలు( Last Elections ) అని స్పష్టం చేశారు.2029 ఎన్నికలలో పోటీ చేసే ఆసక్తి లేదని పేర్కొన్నారు.ప్రస్తుతం తన వయసు 53 అని వచ్చే ఎన్నికలు సమయానికి… 58 అవుతుందని ఆ వయసులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కష్టమని చెప్పుకొచ్చారు.అంతేకాదు తన కూతుర్లకి రాజకీయాలపై ఆసక్తి లేదని పేర్కొన్నారు.
అయితే తన తమ్ముడు కొడుకు ఆసక్తి ఉంటే అప్పటికి పోటీలో ఉండొచ్చని కొడాలి నాని సంచలన ప్రకటన చేశారు.







