Goats rain coats : ఇదేందయ్యా ఇది.. మేకలకు రెయిన్ కోటు తొడిగిన యజమాని.. ఎందుకో తెలిస్తే!

సాధారణంగా వర్షాకాలంలో ప్రజలు రెయిన్ కోట్ వేసుకొని రోడ్లపై కనిపిస్తుంటారు.కానీ ఒక ప్రదేశంలో మాత్రం రోడ్లపై రెయిన్ కోట్ వేసుకున్న మేకలు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

 This Is It The Owner Who Took Off The Raincoat For The Goats.. If Only He Knew-TeluguStop.com

మరి ఆ విశేషాలు తెలుసుకుంటే.తమిళనాడులోని తంజావూర్‌లోని కులమంగళం అనే ఒక గ్రామం ఉంది.

ఈ గ్రామంలో ఒక వ్యక్తికి చాలా మేకలు ఉన్నాయి.అతడు తన మేకలను చాలా గారాబంగా పెంచుకుంటున్నాడు.

అయితే ఇటీవల అతను తన మేకల పట్ల ఉన్న ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు.ఇది చూసే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ మేకల యజమాని తన అన్ని మేకల కోసం బియ్యం బస్తాలను రెయిన్ కోట్ లాగా కుట్టించాడు.

ఈ చలికాలంలో, అలాగే వర్షాకాలంలో తన మేకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే అతడిలా చేశాడట.

మూగజీవుల పట్ల ఇంత కేర్ తీసుకుంటున్న ఇతడిని చాలామంది ప్రశంసిస్తున్నారు.ఈ రైతు వయసు 70 ఏళ్లు అతని పేరు గణేశన్.ఈ మేకల యజమాని తన పొలంలో మేకలతో పాటు ఆవులు, కోళ్లను కూడా పెంచుకుంటున్నారు.అలా పాడి రైతుగా ఇతడు గ్రామంలో మంచి పేరు సంపాదించాడు.

తాను పెంచుకుంటున్న ఆవులు, మేకలు, కోళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసినప్పుడు మేత మేసేలా ఇతను ఏర్పాటు చేస్తున్నాడు.

Telugu Goats, Coats-Latest News - Telugu

గణేషన్ చేసిన ఈ ఐడియా ఇతరులను కూడా ఇన్‌స్పైర్‌ చేస్తోంది.తాము కూడా తమ పశువులకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తామని కొందరు చెబుతున్నారు.ఇక నెటిజన్లు దీన్ని చూసి వాటి ఐడియా గ్రేట్ సార్ మీరు అంటూ పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube