కరోనా వైరస్ భయం ఇంకా పూర్తిగా తగ్గనేలేదు.కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ హార్ట్ రేటును, పల్స్ రేటుని మానిటర్ చేసుకునేందుకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు.అందుకే ఇటీవల కాలంలో ఈ హెల్త్ మానిటరింగ్ డివైజెస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది.
అందుకే ఇప్పుడు గూగుల్ తన పిక్సెల్ డివైజ్ లో హృదయ స్పందన రేటుతో పాటు శ్వాసకోశ రేటును ట్రాక్ చేసే ఫీచర్‌ను కూడా ప్రవేశ పెట్టింది.
గూగుల్ ఫిట్ ఫీచర్ ద్వారా డివైజ్ లోని కెమెరా సెన్సార్లను ఉపయోగించి మనం హెల్త్ ను మానిటర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
అయితే ఈ ఫీచర్ ఇప్పటిదాకా కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.కానీ, ఇప్పుడు మాత్రం ఐఓఎస్ డివైజెస్ లలో కూడా అందుబాటులోకి వచ్చింది.
అంటే ఇకమీదట ఐఓఎస్‌లో రన్ అయ్యే డివైజెస్ తో కూడా మీరు హార్ట్, రెస్పిరేటరీ రేటును చెక్ చేసుకునే సదుపాయం కలదు.ఈ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ 7, ఐపాడ్ ప్రో రెండింటికీ పని చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.
తాజాగా గూగుల్ ఫిట్ హోమ్ ఫీడ్‌లో చెక్ యువర్ హార్ట్ రేట్ అండ్ ట్రాక్ యువర్ రెస్పిరేటరీ రేట్ అనే రెండు ఆప్షన్లను కొత్తగా జోడించింది.ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్మార్ట్‌ఫోన్ లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా ఈ ఫీచర్ పని చేస్తుంది.మీ డివైజ్ వెనుక గల కెమెరా సెన్సార్ పై మీరు బ్రొటన వేలు పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే చాలు హృదయం ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసుకోవచ్చు.కేవలం 30 సెకన్లలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
మరి ఈ ఫలితాలను డిస్‌ప్లే దిగువన పీబీఎం ప్రివ్యూ గ్రాఫ్ రూపంలో చూసుకోవచ్చు.