వామ్మో, ఈ మహిళలు సీట్ కోసం ఇలా కొట్టుకున్నారేంటి.. వీడియో వైరల్!

సాధారణంగా మహిళలు నీటి పంపుల వద్ద గొడవ పడుతూ కనిపిస్తుంటారు.స్థానికంగా వారు పడే గొడవలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

 This Is How Women Fight For A Seat The Video Is Viral ,local Train, Seat Fight,-TeluguStop.com

అయితే తాజాగా ఏకంగా మెట్రో ట్రైన్‌లో మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు.అది కూడా సీటు విషయంలో! దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది చూసి నలుగురు నవ్వుతున్నారు.చిన్న సీటు విషయంలో ఎందుకు ఇలా జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు? ఆడవారు మీరు, ఆ ఓపిక ఉండదా, మీకు? అని చాలామంది తిట్టిపోస్తున్నారు.

స్థానిక మీడియా ప్రకారం..లోకల్ ట్రైన్‌లో సీటు విష‌యంలో మ‌హిళ‌ల మ‌ధ్య మాటా మాటా పెరిగింది.చివరికి వీరు బాహాబాహీకి దిగారు.

ఈ షాకింగ్ ఘ‌ట‌న ముంబై లోక‌ల్ ట్రైన్‌లో చోటు చేసుకుంది.కచ్చితంగా చెప్పాలంటే థానే-ప‌న్వెల్ లోక‌ల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఈ కొట్లాట వెలుగు చూసింది.

ఈ కంపార్ట్‌మెంట్‌లో చదువుకున్న వారిలో కనిపించే మ‌హిళ‌లు ప‌ర‌స్ప‌రం జుట్టు ప‌ట్టుకుని కొట్టుకున్నారు.పలువురు ఆడవాళ్లు ఈ దృశ్యాలను తమ ఫోన్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ మ‌హిళ‌ల‌ను శాంతింప చేసేందుకు శార‌ద ఉగ్లే అనే ఒక మ‌హిళా కానిస్టేబుల్ కూడా ప్రయత్నించింది.మంచి చేయాలని వచ్చిన ఆమెపై కూడా వీరు దాడి చేశారు.దాంతో ఆమెకు గాయాలు అయ్యాయి.

దీంతో ఆమెను హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.ట్రైన్‌లో సీటు ఆక్రమించుకోవాలనే విషయంలో మ‌హిళ‌ల మ‌ధ్య కొట్లాట జరిగిందని.

ఇందులో మ‌హిళా సిబ్బందికి గాయాల‌య్యాయ‌ని వ‌షి రైల్వే స్టేష‌న్ సీనియ‌ర్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ ఎస్ క‌టారె పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube