చంద్రబాబు రాజకీయం అంటే ఇదే ! ఓడించిన వాడికే గెలుపు బాధ్యతలు 

టిడిపి అధినేత చంద్రబాబు ( Chandrababu )రాజకీయ వ్యూహాలు ఆషామాషీగా ఎవరికి అర్థం కావు.అన్ని విషయాల్లోనూ తమదే పై చేయిగా ఉండాలనుకునే వ్యక్తి .

గెలిచినా ,ఓడినా తమ మాటే నగ్గాలనుకునే రకం.2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఊహించని విధంగా టిడిపిని దెబ్బ కొట్టడం, 151 సీట్లతో వైసిపి అధికారంలోకి రావడాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు .ముఖ్యంగా వైసిపి( ycp ) అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) టిడిపిని దెబ్బతీయటమే లక్ష్యంగా పనిచేయడం, వచ్చే ఎన్నికల్లోను టిడిపిని ఓడించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడంతో, చంద్రబాబు దానికి ప్రతి వ్యూహాలను రచించారు.2019లో వైసిపి ఆ స్థాయిలో విజయం సాధించడానికి కారణం రాజకీయ వ్యవహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) అన్న సంగతి తెలిసిందే.ప్రశాంత్ కిషోర్ ఊహాలను అమలు చేయడం ద్వారానే వైసీపీ అధికారంలోకి వచ్చిందని, 151  స్థానాలు దక్కాయని చంద్రబాబు గుర్తించారు.

తమ ఓటమికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ద్వారానే వైసీపీని దెబ్బ కొట్టాలనే వ్యూహంతో చంద్రబాబు ఉన్నారు.

ఎప్పుడో పీకే ని వ్యూహకర్తగా నియమించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు.ప్రస్తుతం తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానని ప్రశాంత్ కిషోర్ చెప్పడంతో సైలెంట్ అయిపోయారు.అయితే ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో తమ పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ ను ఒప్పించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ద్వారా లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో చర్చించారని, ఇప్పుడు చంద్రబాబు ను ఉండవల్లికి వచ్చి మరి కలవడం వెనక కారణం అదేననే ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం వైసీపీలో టికెట్లు మార్పు వ్యవహారం పెద్ద గందరగోళంగా మారింది.

Advertisement

ఆ పార్టీలో దాదాపు 80 నుంచి 90% స్టేట్లో మార్పు చేర్పు చేపట్టేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.దీని అందరికీ కారణం ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం అందించిన సర్వే నివేదికలే కారణం.అయితే ఇప్పుడు అదే సంస్థకు అధిపతి అయిన పీకే వైసీపీని ఓడించేందుకు టిడిపికి వ్యూహాలు అందించేందుకు సిద్ధమవడం సంచలనగా మారింది.2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడానికి కారణమైన ప్రశాంత్ కిషోర్ ద్వారానే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి చంద్రబాబు బీజాలు వేశారని, ఈ దెబ్బకు వైసిపి ఓటమి చెందడం ఖాయం అనే ధీమా టిడిపి నాయకులలో కనిపిస్తోంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు