సమ్మర్ లో మీ బాడీని చిల్ చేసే డ్రింక్ ఇది.. రోజు తాగితే మస్తు హెల్త్ బెనిఫిట్స్!

సమ్మర్ సీజన్ ప్రారంభం అయ్యింది.మార్చి నెల అలా వ‌చ్చిందో లేదో ఇలా ఎండలు ఊపందుకున్నాయి.

ఎండల దెబ్బకు బాడీ తరచూ వేడిగా, వీక్ గా మారిపోతుంటుంది.నీరసం, అలసట, చికాకు, అధిక‌ దాహం వంటివి తీవ్రంగా మదన పెడుతుంటాయి.

అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే మీ బాడీ చిల్ అవుతుంది.క్షణాల్లో నీరసం, అలసట, చికాకు, అధిక దాహం వంటి సమస్యలు దూరం అవుతాయి.

సూపర్ యాక్టివ్ గా మారతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా రెండు పండిన స‌పోటా పండ్ల( Sapota )ను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి పై తొక్క మరియు లోపల ఉండే గింజలు తొలగించి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో సపోటా పండ్లు వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, ఒక గ్లాసు పాలు( Milk ), పావు టేబుల్ స్పూన్ యాల‌కుల పొడి, నాలుగు ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధమవుతుంది.

సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ సపోటా డ్రింక్‌ను తీసుకుంటే బాడీ చిల్ అవుతుంది.వేసవిలో వేధించే నీరసం, అలసట, అధిక దాహం, డీహైడ్రేషన్ తదితర సమస్యల‌న్నీ ప‌రార్ అవుతాయి.అంతే కాదు సమ్మర్ లో ఈ డ్రింక్ ను ప్రతి రోజూ తీసుకుంటే ఎముకలు బలంగా దృఢంగా మారతాయి.

శరీరం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటుంది.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

మలబద్ధకం( Constipation ) సమస్య దూరం అవుతుంది.అధిక రక్తపోటు నుంచి ఉపశమనం లభిస్తుంది.చర్మం నిగారింపుగా మెరుస్తుంది.

Advertisement

మరియు రక్తహీనత సమస్య ఉన్నా సరే దూరం అవుతుంది.కాబట్టి ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఆరోగ్యంగా మరియు ఉత్సాహంగా ఉండాలని కోరుకునే వారు తప్పకుండా ఈ సపోటా డ్రింక్ ను తమ రెగ్యులర్ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు