ఏక‌గ్రీవాల‌పై టీడీపీకి ఇది పెద్ద షాకే...!

పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై టీడీపీలో త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది.

ఏక‌గ్రీవాల విష‌యంలో పార్టీ స్టాండ్ ఏంట‌ని నాయ‌కుల మ‌ధ్య ప్ర‌శ్న త‌లెత్తింది.

ఈ విష‌యంలో పైకి ఒక‌టి లోలోన ఒక‌టి చేస్తున్నా మా? ఇదే వివాదాల‌కు కార‌ణం అవుతోందా? అని నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నార‌ని స‌మాచారం.శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ విష‌యాన్ని తీసుకుంటే ఇక్క‌డ కొన్ని ద‌శాబ్దాలుగా ఏక‌గ్రీవం జ‌రుగుతోంది.

అయితే అన్ని ద‌శాబ్దాలుగా కూడా కింజ‌రాపు ఫ్యామిలీనే ఇక్క‌డ పంచాయ‌తీ స‌ర్పంచ్ ప‌ద‌విని పొందుతోంది.అయితే.ఇప్పుడు మార్పు జ‌రిగింది.

వైసీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి నామినేష‌న్ వేశారు.దీనిని ఎలా త‌ప్పు ప‌డ‌తాం! అంటున్నారు త‌మ్ముళ్లు.

Advertisement

ఏక‌గ్రీవాలు వ‌ద్ద‌ని.పోటీ ఉన్న చోట అభ్య‌ర్థుల‌ను ప్రోత్స‌హిద్దామ‌ని మ‌న నాయ‌కుడే చెబుతున్నారు.

కానీ, ఇక్క‌డ ఇప్పుడు పోటీకి మ‌రో అభ్య‌ర్థి ల‌భించే స‌రికి ల‌బ‌ల‌బ‌లాడు తున్నారు.పైగా వివాదం ముందుగానే ప‌సిగ‌ట్టి కూడా మ‌నం హెచ్చ‌రించ‌లేక పోయాం.

ఇది చివ‌ర‌కు అరెస్టు వ‌ర‌కు దారి తీసింది.

ఇక‌, ఏక‌గ్రీవాల విష‌యంలోపైకి ఒక‌మాట‌.లోలోన మ‌రో మాట ఉంటే ఎలా అనేది త‌ట‌స్థ నేత‌ల మాట‌.వైసీపీ ఏక‌గ్రీవాల‌కు మొగ్గు చూపుతోంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఏక‌గ్రీవాల‌ను ప్రోత్స‌హిస్తూ న‌గ‌దు బ‌హుమానాల‌ను కూడా పెంచింది.దీనిని టీడీపీగా మ‌నం తప్పుప‌ట్టాం.

Advertisement

కానీ, నిమ్మాడ విష‌యానికి వ‌చ్చే స‌రికిమాత్రం న్యాయం జ‌ర‌గాల‌ని కోరుతున్నాం.ఇది స‌రైన విధానం కాద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

దీంతో మ‌న‌లో చాలా మంది ఈ విష‌యంపై ఎలా స్పందించాలో తెలియ‌క ఇబ్బంది ప‌డిన సంద‌ర్బాలు ఉన్నాయి.అని త‌మ్ముళ్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగ‌డం గ‌మ‌నార్హం.

తాజా వార్తలు