బాహుబలి సినిమాలో తమన్నా రోల్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో బాహుబలి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించినా ఊహించని స్థాయిలో గుర్తింపు వస్తుందనే సంగతి తెలిసిందే.

 This Heroine Missed Chance In Bahubali Movie Details Here , Bahubali Movie , T-TeluguStop.com

బాహుబలి సినిమా సక్సెస్ తమన్నా కెరీర్ కు ఎంతో ప్లస్ అయింది.ఊహలు గుసగుసలాడే సినిమా వల్ల హీరోయిన్ రాశీఖన్నాకు టాలీవుడ్ లో గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ఈ సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో రాశీఖన్నా చోటు సంపాదించుకుంది.

అయితే ఈ బ్యూటీకి తెలుగులో ఊహించని స్థాయిలో గుర్తింపు రావడానికి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో క్రేజ్ పెరగడానికి రాజమౌళి కారణమని సమాచారం.

బాల్యంలో కలెక్టర్ కావాలని అనుకున్న ఈ బ్యూటీ అనుకోకుండా హీరోయిన్ అయింది.బాహుబలి సినిమాలో తమన్నా పోషించిన రోల్ కు అడిషన్ ఇచ్చిన రాశీఖన్నా సినిమాలోని కొన్ని సన్నివేశాలకు ఆమె సూట్ కాదని భావించి ఊహలు గుసగుసలాడే సినిమాకు రికమెండ్ చేయడం ఆ సినిమాలో రాశీఖన్నా సెలెక్ట్ కావడం జరిగింది.

Telugu Bahubali, Rashi Khanna, Love Breakups, Pucca, Rajamouli, Tamnna Role, Tha

తన జీవితంలో లవ్ బ్రేకప్స్ ఉన్నాయని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు. బోల్డ్ సీన్లు చేయడానికి తాను సిద్ధమేనని ఆమె అన్నారు.ఇంట్లో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ల మద్దతుతో సినిమాలు చేస్తున్నానని రాశీఖన్నా కామెంట్లు చేశారు.తన పేరెంట్స్ ప్రేమ పెళ్లి చేసుకున్నారని తనకు కూడా ప్రేమలో పడాలని ఉందని రాశీఖన్నా పేర్కొన్నారు.

రాశీఖన్నా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Telugu Bahubali, Rashi Khanna, Love Breakups, Pucca, Rajamouli, Tamnna Role, Tha

రాజమౌళి డైరెక్షన్ లో నటించి ఉంటే మాత్రం రాశీఖన్నా రేంజ్ మారిపోయేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాశీఖన్నా నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలు విడుదల కావాల్సి ఉంది.ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో రాశీఖన్నా బిజీగా ఉండటం గమనార్హం.

రాశీఖన్నా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube