టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఐదో తారీకు సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు హీరో శర్వానంద్.అయితే ఈయన కెరియర్ మొదట్లో హీరోగా కాకుండా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ మెప్పించారు.
ఇలా పలు సినిమాలలో హీరో తమ్ముడి పాత్రలలో నటించిన శర్వానంద్ అనంతరం హీరోగా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు.శర్వానంద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్తి అయింది.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా తన సినీ ప్రయాణం గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… గత 20 సంవత్సరాలుగా వెండితెరపై ఎన్నో పాత్రలలో నటిస్తూ అందరిని అల్లరిస్తున్నాను.ఎన్నో భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 ఏళ్ల స్నేహం కష్టాలు ఎత్తులు లోతులు చిరునవ్వులు మరెన్నో ఇలా ఈ నా 20 సంవత్సరాల సినీ జీవితంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు.ఇక ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని ఎంతో అద్భుతంగా మలిచాయి.

ఈయన ఒకే ఒక జీవితం సినిమాకు అంకితం.20 సంవత్సరాల క్రితం నా సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన ఈ సినీ ప్రస్థానం మరపురానిది.ఈ సినీ ప్రపంచంలో నా గమ్యం ఎంతో దూరం మిమ్మల్ని అలరించడం కోసం ప్రతిక్షణం రన్ రాజా రన్ ల పరుగులు తీస్తూ ఉంటాను.శతమానం భవతి అని మీరు నాకు ఇచ్చేఆశీస్సులతో అది సాధ్యమవుతుందని నేను అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా శర్వానంద్ తన 20 సంవత్సరాల సినీ జీవితం గురించి గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







