ఈ దోశ భలే వింతగా ఉంది.. పాన్‌తో తయారీ

ఏదైనా హోటల్‌కి వెళ్లి మార్నింగ్ టిఫిన్ చేయాలంటే చాలా ఐటమ్స్ ఉంటాయి.దోశ, ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా లాంటి చాలా ఐటమ్స్ ఉంటాయి.

 This Dosha Is Very Strange Preparation With Pan, Dosa, Strange Dosa, Preparation-TeluguStop.com

వాటిల్లో మనకు ఇష్టమైనది, ఏది తినాలనిపిస్తే అది ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాము.ఇక టిఫిన్లలో కూడా చాలా రకాలు ఉంటాయి.

ఇడ్లీ విషయానికొస్తే నెయ్యి ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ లాంటివి చాలా ఉంటాయి.ఇక దోశ విషయానికొస్తే అనేక రకాల దోశలు లభిస్తాయి.

ఉల్లి దోశ, పిజ్జా దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ లాంటి విభిన్న రకాలలో దోశ లభిస్తుంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ విభిన్నమైన దోశ( Dosa ) ఐటమ్ గురించి చర్చ జరుగుతోంది.అదే పాన్ దోశ.హ్యాపీ ఫీట్( Happy feat ) అనే ట్విట్టర్ యూజర్ ఈ దోశ తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో ఇది ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.ఈ కొత్త రకం దోశను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియోలో ఒక వ్యక్తి తమలపాకులు( Betel leaves ) యాడ్ చేసిన ఆకుపచ్చని రంగులో ఉన్న దోశ పిండిని వేడిగా ఉన్న తవాపై పోశాడు.తర్వాత దోశపై వెన్న రాసిన తర్వాత పాన్, చెర్రీస్, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, డ్రై ఫ్ల్రూట్స్ లాంటి ఐటమ్స్ కలిపి ఉన్న పేస్ట్‌ను వేశాడు.

వాటన్నింటిని దోశపై వేసిన తర్వాత అటూ, ఇటూ మొత్తం కలిసేలా తిప్పాడు.ఈ వినూత్నమైన దోశను చూసి షాకైన ఓ కస్టమర్ దీనికి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.దీంతో ఈ పాన్ దోశ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కొంతమంది ఈ దోశ కాంబినేషన్‌పై మండిపడుతున్నారు.పాన్‌తో దోశ ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.ఈ వీడియో షేర్ చేసి వ్యక్తిపై కూడా ఫైర్ అవుతున్నారు.

ఇలాంటివి చూపించకండి అంటూ కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube