కాలం మారుతున్న కొద్దీ ప్రపంచంలోని మానవ జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఇంతకు ముందు కేవలం ఇల్లు అంటే మనుషులు మాత్రమే ఉండే దగ్గరి నుంచి పెంపుడు కుక్కలు కూడా ఇంట్లో భాగం అయిపోయే దాకా వచ్చింది.
పట్టణాల్లో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది.ప్రతి ఇంట్లోనూ కుక్కలు పెంచుకోవడం చాలా సర్వ సాధారణం అయిపోయింది.
పైగా వాటిని తమ కుటుంబ సభ్యుడిగా చెప్పడం కూడా జరుగుతోంది.అయితే కుక్కల విషయానికి వస్తే అవి ఎంత పెద్ద ధనవంతుల ఇంట్లో అయినా ఉంటాయి.
కానీ వాటి పేరు మీద మాత్రం ఎలాంటి ఆస్తులు ఉండవు కదా.కానీ ఇప్పుడు ఈ కుక్క గురించి తెలిస్తే మాత్రం బతికితే ఈ కుక్కలా బతకాలి అనకుంటారేమో.
ఇలా ఎందుకు చెబుతున్నామంటే అప్పుడప్పుడు జీవితంలో ఏవైనా బాధలు వస్తే ఇదే బతుకు కుక్క కన్నా హీనం అని బాధ పడుతుంటాం.కానీ ఇప్పుడు మేం చెప్పబోయే కుక్క గురించి తెలిస్తే మాత్రం నిజంగా ఇలాగే బతకాలి అనుకుంటారు కావచ్చు.
అమెరికాలోని మియామికి చెందిన ఓ కుక్క ప్రపంచంలోనే ధనవంతురాలిగా ఉంది.దీని పేరు మీద వందల కోట్ల ఆస్తి కూడా ఉందండోయ్.
దీని పేరు గుంథర్ VI.దీని తాత గుంథర్ IV అనే కుక్క నుంచి వారసత్వంగా ఈ ఆస్తి లభించింది.దీని తాతలు, తండ్రుల నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చిన ఆస్తి కాస్తా ఈ కుక్క వంతు వచ్చే సరికి మాత్రం అది రూ.431 కోట్లకు పెరిగింది.దీనికి స్వయంగా ఓ పెద్ద బిల్డింగ్ కూడా ఉంది.ఇందులోనే అది జీవిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు అయిన కుక్కగా ఇది ఉంది.హ్యాండర్ల బృందం ఈ కుక్క ఆస్తుల వ్యవహారాలతో పాటు ఈ కుక్క బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఇలా ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు అయిన కుక్కగా వెలుగు వెలుగుతోంది.
.