సంస్కరణలుదేశాభివృద్ధికిగొడ్డలిపెట్టు ప్రజల జేబులు లూటీకే ఈ ప్రయత్నం ప్రజలకు ఉరితాళ్ళు గా మారనున్నసంస్కరణలు ఉద్యోగులకే కాదు,వ్యవసాయ, గృహవినియోగదారులకు పెను భారమే ధరల నియంత్రణ పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వేడుతుంది డిస్కం లు ప్రయివేటి కరణ అంటే ప్రజలకు ద్రోహం చెయ్యడమే పెట్టుబడి దారుల చేతికి విద్యుత్ రంగం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిందే నేడు నిజం అయ్యింది ఉద్యోగులు,ప్రగతి శిలురు ఇందుకు వ్యతిరేకంగా ఉద్యమించాలి చట్టాల పై ప్రజల్లో వ్యతిరేఖత వస్తుంది అది గుర్తించిన మీదటనే జీ.ఓలు,సర్కులర్ల పేరుతో అమలు మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్ రంగంలో తెచ్చిన సంస్కరణలు దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు లాంటిదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
ప్రజల జేబుల లూటీకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు.బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని అడపడచులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మహిళలకు అందజేశారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ విద్యుత్ రంగంలో తెచ్చిన సంస్కరణలు ప్రజలకు ఉరితాళ్లుగా మారబోతున్నాయన్నారు.ఇది ఒక్క ఉద్యోగుల సమస్య మాత్రమే కాదని, వ్యవసాయ, పరిశ్రమ రంగాలతో పాటు దేశంలోని గృహ వినియోగదారుల మీద పెను భారం పడబోతుందన్నారు.
డిస్కం లు ప్రయివేటి కరణ అంటేనే అది ప్రజలకు ద్రోహం చెయ్యడమే నని ఆయన మండిపడ్డారు.తద్వారా ధరల నియంత్రణ పూర్తిగా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వేడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్టుబడి దారులకు విద్యుత్ రంగం అప్పగించ బోతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నది నేడు నిజమే నన్నది నిరూపితమైనదని ఆయన తెలిపారు.ఉద్యోగులు ,ప్రగతి శిలురతో పాటు యావత్ భారతదేశం దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
బిజెపి పాలకులు తెచ్చిన విద్యుత్ చట్టాల సవరణ పై ప్రజల్లో వస్తున్న వ్యతిరేఖత నుండి తప్పించుకోవడానికే జీ.ఓ లు,సర్క్యులర్ ల పేరుతో అవే అంశాలు అమలు పరుస్తున్నారని ఆయన మండిపడ్డారు.







