దేశంలో సార్వత్రిక ఎన్నికల మూడో దశ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు మొత్తం 94 లోక్సభ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ( EC Notification ) జారీ చేసింది.
మే 7వ తేదీన పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో పోలింగ్ జరగనుంది.అసోం,( Assam ) ఛత్తీస్ గఢ్,( Chattisgadh ) బీహార్, దాద్రానగర్ హావేలి, డామన్ డయ్యు, గోవా, జమ్మూకశ్మీర్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్( Assembly Election Schedule ) విడుదలైన సంగతి తెలిసిందే.కాగా ఈ ఎన్నికలకు జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది.