ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.ఈ మేరకు ఎల్లుండి ఈ సమావేశం నిర్వహిస్తుండగా ఈ నెల 23న బీజేపీ( BJP ) లోక్ సభ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ బీజేపీ లోక్ సభ అభ్యర్థులపై( BJP Loksabha Candidates ) స్పష్టత రానుంది.కాగా ఏపీలో పొత్తులో భాగంగా ఆరు ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.
అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ మేరకు ఇప్పటికే అధిష్టానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandeshwari ) అభ్యర్థుల జాబితాను అందించారు.
అరకు నుంచి గీత, అనకాపల్లి అభ్యర్థిగా సీఎం రమేశ్, రాజమండ్రి అభ్యర్థిగా పురందేశ్వరి, రాజంపేట అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేశ్, హిందూపురం నుంచి సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపన చౌదరి బరిలో దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తుది కసరత్తు చేసి బీజేపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థులతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.