ఈ వస్తువులు ఇంట్లో ఉంటే.. డబ్బు పరిగెత్తుకుంటూ వస్తుంది! 

"ధనమేలే అన్నింటికీ మూలం." అని ఓ తెలుగు సినీ కవి చెప్పినట్లు.

మనిషి జీవితంలో డబ్బు అనేది కీలక పాత్ర పోషిస్తుంది.మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి విషయం, ప్రతి అంశంలోనూ సొమ్ము అవసరం ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

మీకు డబ్బు విపరీతంగా వచ్చి పడాలంటే ఈ 8 రకాల వస్తువులను మీ ఇంటిలో తప్పకుండా ఉంచాలని  నిపుణులు అంటున్నారు.కష్టాలు ఉండడం సహజమని, అసలు ఈ భూ ప్రపంచం మొత్తం మీద కష్టం అంటే తెలియని ఒక్కటంటే ఒక్క కుటుంబం కూడా ఉండదని చెబుతున్నారు.

కష్టాలు వచ్చినపుడు కుంగిపోకుండా అసలు ఆ కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలనే విషయాన్ని గురించి ఆలోచించాలని చెబుతున్నారు.సరైన నిర్ణయాలు తీసుకోవడం వలన కష్టాలు ఈజీగా దూరమయిపోతాయని సూచిస్తున్నారు.

Advertisement
Things To Kept In House To Attract Wealth, Devotional , Lakshi Devi , Pooja , Go

మన కష్టాలు దూరమయి మన కుటుంబంలో డబ్బు అధికంగా నిల్వ ఉండేందుకు ఈ 8 రకాల వస్తువులు మన ఇంటిలో తప్పకుండా ఉండాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.ఆ వస్తువులేంటనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే.

ఓంకారం.హిందూ పురాణాలు చెప్పిన దాని ప్రకారం ఓంకారం సింబల్ చాలా ప్రత్యేకమైనది.దీనిని అనేక మంది తమ ఇళ్లల్లో ఉంచుకుని పూజిస్తారు.

అలా చేయడం వలన ఎటువంటి నెగటివ్ ఎనర్జీలు మన దరికి చేరవని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.పూర్ణకుంభం.ఇక పూర్ణకుంభం కూడా ఇంటిలో ఉండడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయని అనేక మంది విశ్వసిస్తారు.ఈ పూర్ణ కుంభాన్ని శుభకార్యాల్లో తప్పకుండా వాడుతారు.

Things To Kept In House To Attract Wealth, Devotional , Lakshi Devi , Pooja , Go

నీటిలో తాబేలు.ఇక డబ్బు నిల్వ ఉండడం కోసం ఇంటిలో ఉంచాల్సిన మరో పరికరం తాబేలు.ఒక ప్లేటులో నీటిని పోసి అందులో తాబేలు ప్రతిమను కనుక ఉంచితే చాలా మంచిదట.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

ఇలా ఉంచడం వలన మన ఇంటిలోని వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని మరియు ఇంటిల్లి పాదీ సుఖ సంతోషాలతో జీవిస్తారని అనేక మంది నమ్ముతారు.గోల్డ్ ఫిష్ ఇక ఇంట్లో చేప పిల్లలను పెంచడం చాలా మంచిదట.

Advertisement

చేపల్లో గోల్డ్ పిష్ అనేది ఉంటే అది మీ ఇంటిలో ఉన్న అన్ని రకాల వాస్తు దోషాలను పోగొడుతుందట.గాలి గంటలు.ఇక పోతే గాలికి రకరకాల శబ్దాలు చేసే గంటలను ఇంటిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

వీటిని విండ్ చిమ్స్ అని వ్యవహరిస్తారు.పైన పేర్కొన్న అన్ని వస్తువులకంటే వీటిని ఇంటిలో ఉంచుకోవడం చాలా మంచిది.

తాజా వార్తలు