కాటేపల్లిలో ఓ ఇంట్లో బంగారం,నగదు కొట్టేసిన దొంగలు

యాదాద్రి భువనగిరి జిల్లా: మోటకొండూరు మండలం కాటపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని చోరికి పాల్పడి సుమారు 12 తులాల బంగారం,రూ.లక్ష నగదు అపహరించుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 Thieves Stole Gold And Cash From A House In Katepally , Si Pandu, Katepally , G-TeluguStop.com

మోటకొండూరు ఎస్ఐ పాండు తెలిపిన వివరాల ప్రకారం…కాటపల్లి గ్రామానికి చెందిన సప్పిడి యాదిరెడ్డి,భార్య, కుమారుడితో కలిసి శనివారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.ఇంటి వద్ద ఉన్న కోడలు సాయంత్రం ఇంటికి తలుపులు వేసి పక్కింటికి వెళ్ళింది,ఇదే అదునుగా చూసి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా తీసి చూడగా ఎలాంటి వస్తువులు దొరకలేదు.

సబ్జాపై దాచిన 10 బంగారం,నగదు ఎత్తుకెళ్లారు.ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు బంగారం,నగదు చోరికి గురైనట్లు గుర్తించి,వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఎసిపి రమేష్ కుమార్,సిఐ కొండల్ రావు,డాగ్ స్వాడ్, క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టారు.ఘటనపై బాధితురాలు సప్పిడి దేశమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు.

అయితే చోరీ జరిగిన విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సబ్జాపైన పెట్టిన విషయం కుటుంబ సభ్యులకు,దగ్గరి వాళ్ళకే తెలిసి ఉండే అవకాశం ఉంది.

కాబట్టి దొంగతనం చేసింది తెలిసిన వారేనా లేక దొంగలే నేను గ్ గుడ్ చేశారా అనేది పోలీసు విచారణలో నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు.గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న మండలంలో మళ్ళీ ఓ దొంగతనం జరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గురవుతున్నారు.

పోలీసులు గ్రామాలపై నిఘా పెంచి,నిరంతరం గస్తీ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube