అమెరికాలో వింత చోరీలు...ఆ కుక్కల యజమానులకు పోలీసుల హెచ్చరిక...!!!

దొంగలు సహజంగా డబ్బు, బంగారం, విలువైన వస్తువులను దొంగతనం చేస్తారు ఇది అందరికి తెలిసిందే.అయితే అమెరికాలో దొంగల పద్దతి మాత్రం పూర్తిగా భిన్నం.

 Thieves Steal Family Dog From Mom, Daughter At Gunpoint During Walk: Police, Thi-TeluguStop.com

వాళ్ళు చేసే దొంగతనాలు కూడా కాస్త వెరైటీగానే ఉంటాయి.కొన్ని రోజుల క్రితం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఓ గూడ్స్ రైలులో ఈ కామర్స్ సంస్థలు తమ ఖాతా దారులు బుక్ చేసిన వస్తువులను పంపుతున్న క్రమంలో ఏకంగా రైలులో వస్తువులు ఓ ప్రదేశంలో కాజేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది.

ఈ ఘటనకే అందరూ నవ్వుకుంటే తాజాగా జరిగిన వరుస దొంగతనాలు అందరిని విస్మయానికి గురిచేస్తోంది.

ఓ మహిళ కారులో ప్రయాణిస్తోంది, ఓ ప్రదేశానికి వెళ్ళిన తరువాత కారును కొందరు దుండగులు ఆపారు, గన్ తో బెదిరిస్తూ ఆమె వద్దకు వస్తున్న వారిని చూసి ఆమెకు గుండె ఆగినంత పనయ్యింది.

అయితే వారు ఆమె వద్దకు వచ్చి కారులో ఆమెతో పాటు ఉన్న ఓ బుల్లి కుక్కను ఎత్తుకుపోయారు.నగలు, డబ్బు ఏమీ అడగలేదు.

ఈ ఘటన ఆమెను చాలా షాక్ కి గురిచేసింది.ఈ ఘటన కాలిఫోర్నియాలో జరిగింది.

అంతేకాదు ఈ ఒక్క రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు రోజుకో మూల జరుగుతూనే ఉన్నాయి.డబ్బులు, నగలు అడగకుండా కుక్కపిల్లలను తీసుకుపోవడానికి కారణం ఏంటా అని అధికారులు బుర్రలు బాదుకుంటున్నారట.

అయితే నిపుణులు ఈ చోరీలకు గల కారణాలను ఓ అంచనా వేశారట అదేంటంటే

కుక్కలను దొంగతనాలు చేస్తున్న వారందరూ ఒకే రకమైన ఫ్రెంచ్ బుల్ డాగ్ లను ఎత్తుకుపోతున్నారు.మార్కెట్ లో వీటికి భారీ డిమాండ్ ఉంది, వీటిని సామాన్యులు కొనాలని అనుకున్నా కొనుక్కోలేరు ఎందుకంటే వీటి ఖరీదు సుమారు 5వేల డాలర్ల పై మాటే అంటే భారత కరెన్సీలో రూ.3.50 లక్షలు అంతేకాదు ఇవి అత్యంత అరుదైన జాతిగా కూడా పేరొందాయి, పైగా ఇవి ఒకటి లేదా రెండు పిల్లలను మాత్రమే పెడుతాయట.దాంతో వీటిని దొంగిలించి వాటిని అమ్మడం లేదా వాటి ద్వారా సంతాన ఉత్పత్తి చేసి పిల్లలు అమ్ముకోవడం కోసం ఈ దొంగతనాలు చేస్తున్నట్టుగా అభిప్రాయ పడుతున్నారు.ఏది ఏమైనా ఇలాంటి కుక్కలు ఉన్న యజమానులు మాత్రం వాటిని బయటకు షికారు కోసం తీసుకురావద్దంటూ హెచ్చరిస్తున్నారు.

Thieves Steal Family Dog From Mom, Daughter At Gunpoint During Walk: Police, Thieves Stealing Dogs, Dog Breed, US, Thieves In US, Dog Breed, French Bulldog Breed,US Thieves - Telugu Dog Breed, Frenchbulldog, Steal Dog Mom, Dogs

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube