సీసీ రోడ్డు వేస్తామని తవ్వారు...అడ్డంగా బండ వేసి పోయారు

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని మూడో వార్డులో సీసీ రోడ్డు (CC road) వేస్తామని 8 నెలల క్రితం మోరీని పగులగొట్టి దానిపై వచ్చిన సీసీ బండను గల్లీలో రోడ్డుకు అడ్డంగా పడేసి వెళ్ళిపోయారు.సీసీ రోడ్డు వేస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది.8 నెలలుగా సీసీ రోడ్డు వేయకుండా, అడ్డంగా వేసిన బండను తొలగించకుండా నిర్లక్ష్యంగా ఉండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 They Dug To Build A Cc Road They Put A Rock Across It, Yadadri Bhuvanagiri Distr-TeluguStop.com

సీసీ రోడ్డు లేకున్నా సరేగాని బండను తొలగించాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.

ఎవరిని అడిగినా వేసింది ఎవరు తీసేది ఎవరని అంటున్నారని, అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.కాలనీ ప్రజలు చిన్న చిన్న పనులకు మోటారు సైకిల్(Motorcycle) మీద వెళ్లాలంటే ఇబ్బందిగా మారిందని,రాత్రి సమయంలో తెలియని వారు వస్తే ప్రమాదాలు జరగవచ్చని,వెంటనే అధికారులు స్పందించి దారికి అడ్డంగా ఉన్న బండను తక్షణమే తొలగించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube