కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.
సీబీఐ విచారణకు హాజరయ్యేందుకే అవినాశ్ రెడ్డి హైదరాబాద్ వచ్చారని సజ్జల వెల్లడించారు.తల్లి అనారోగ్యంపై సీబీఐకి అవినాశ్ సమాచారం ఇచ్చే ఉంటారన్నారు.
తల్లికి సీరియస్ గా ఉండటంతో విచారణకు హాజరు కాలేదని పేర్కొన్నారు.అవినాశ్ రెడ్డి రేపు అయినా సీబీఐ విచారణకు హాజరవుతారని తెలిపారు.
కొందరు కావాలనే హాడావుడి చేస్తున్నారన్న సజ్జల సీబీఐ నిందితుడిగా చేర్చిన తరువాతనే అవినాశ్ రెడ్డి బెయిల్ అప్లై చేశారని తెలిపారు.అవినాశ్ రెడ్డికి వివేకా హత్యతో సంబంధం ఉంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు వదిలి పెట్టేవారా అని ప్రశ్నించారు.