నా చుట్టూ ఉన్నదంతా వాళ్లే.. సంచలనంగా మారిన విష్ణు ప్రియ పోస్ట్?

టెలివిజన్ లో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ విష్ణు ప్రియ.ఈమె పోవే పోరా అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో అనంతరం పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసినప్పటికీ ఈమెకు బుల్లితెర పైన అలాగే వెండితెరపై కూడా ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో అభిమానులను సందడి చేస్తున్నారు.

 They Are All Around Me Vishnu Priyas Post That Became A Sensation , Vishnu Priya-TeluguStop.com
Telugu Manas, Tv Shows, Vishnu Priya-Movie

ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం హాట్ ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అలాగే పలు డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో విష్ణుప్రియ నటించిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక బిగ్ బాస్ మానస్ తో కలిసి ఈమె జరీ జరే పంచ అనే ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Telugu Manas, Tv Shows, Vishnu Priya-Movie

ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఎంతో సందడి చేస్తే విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.సాధారణంగా మన చుట్టూ ఉన్న కొంతమంది ఏం మాట్లాడినా మనకు అర్థం కాదు అలాగే మనం ఏం మాట్లాడకపోయినా అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు అనే కొటేషన్ షేర్ చేశారు.ఇలా ఈ కొటేషన్ ను షేర్ చేస్తూ నా చుట్టూ కూడా అలాంటి వాళ్లే ఉన్నారు.

నేను మాట్లాడకపోయినా నా మనస్తత్వాన్ని, నా పిచ్చిని,నా తిక్కను అర్థం చేసుకొని స్నేహితులు ఉన్నారంటూ తన స్నేహితుల గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube