ఇప్పుడు చాలా సినిమాల్లో తెలంగాణ యాస అనేది బాగా వినిపిస్తోంది.సినిమాల్లో ఎవరి నోట విన్నా తెలంగాణ మాటే వినపడుతోంది.
ఇక తెలంగాణ పాటలు( Telangana Folk Songs ) కూడా సోషల్ మీడియాని దున్నేస్తున్నాయి.సారంగదరియా, చమ్కీల అంగిలేసి, ఉరుముల రమ్మంటినా వంటి జానపద పాటలతో పాటు చాలా తెలంగాణ సాంగ్స్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ షార్ట్ వీడియోస్ ఇలా వేటిలో చూసినా తెలంగాణ జానపద పాటలకు డ్యాన్స్‌లు వేస్తున్న వారే కనిపిస్తున్నారు.ఫంక్షన్లలో, డీజేలలో ఇంకా తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా తెలంగాణ పాటలే వినిపిస్తున్నాయి.
జనాలందరూ వాటికే డాన్సులు వేస్తున్నారు.
ఇలాంటి సమయంలో మరో మూడు అదిరిపోయే ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఫేమస్ డాన్సర్ నాగదుర్గ( Naga Durga ) నటించిన ఈ పాటలు ప్రైవేటు సాంగ్స్‌గా రూపొంది యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయ్యాయి.ఈ పాటల్లో మొదటిది “తిన్నా తిరం పడతలే, సున్నా తిరం పడతలే… బాధయితందే నీ యాదిల మనసంతా… మస్తు బరువయితందే నీ యాదిల మనసంతా” అంటూ సాగుతుంది.
చిన్నపాటి గొడవలకే తనకు దూరమైన భర్తను, లవర్‌ను తలుచుకుని ఒక యువత పాడే పాట ఇది.ఈ పాట మ్యూజిక్ బీట్ పెద్దగా ఆకట్టుకోదు కానీ ఫోక్ సింగర్ లక్ష్మి( Folk Singer Lakshmi ) వాయిస్ అందర్నీ ఆకట్టుకుంటోంది.లక్ష్మి ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓసారి కనిపించే సుడిగాలి సుధీర్‌తో డ్యాన్స్ కూడా వేసింది.

తరువాత నాగదుర్గతో “తిన్నా తిరం పడతలే” పాట( Thinna Thiram Paduthale ) వీడియో సాంగ్ రూపంలో అందుబాటులోకి వచ్చి 11 కోట్ల వరకు వ్యూస్ సంపాదించింది.అందులో నాగదుర్గ పెద్దగా స్టెప్పులు ఏమీ వేయలేదు కానీ ఈ పాట సూపర్ హిట్ అయింది.ఇది రెండేళ్ల క్రితం వచ్చింది కానీ ఇప్పుడు బాగా క్లిక్ అయింది.
అందుకే అమ్మాయిలు ఈ పాటకు డాన్సులు వేస్తూ వైరల్ చేస్తున్నారు.రెండవ పాట “కాపోళ్ల ఇంటికాడ కాములాటనట… పడుచోళ్లంత వచ్చి ఆడుకుంటరట… ఆడబోదమా బావా, మనం చూడబోదామా…” అంటూ సాగుతుంది.
ఈ పాటకు నాగ దుర్గ అద్భుతంగా డ్యాన్స్ చేసింది.అయినా ఆమె స్టెప్పులను అనుసరించేందుకు, ఈ పాటకు డ్యాన్స్ వేసేందుకు అమ్మాయిలు ప్రయత్నిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇక మూడో పాట “జిల్లేలమ్మ జిట్ట… ఏందే ఏమే అంటాడు, వాడి పెళ్లాన్నే నేనయినట్టు, ఐనా కోపం రాదేందే వాడి మాయల నేను పడ్డట్టు” అని సాగుతుంది.నాగదుర్గ ఈ పాటకు ఓ రేంజులో డాన్స్ వేసింది.ఆ స్టెప్పులు అనుసరించడం ప్రొఫెషనల్ డాన్సర్లకు మాత్రమే సాధ్యమవుతుంది.అయినా మహిళలు, పిల్లలు, అమ్మాయిలు ఈ పాటను ఎంచుకొని తమకు తోచినట్లు డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఒరిజినల్ పాటలకే కాకుండా వీరు చేస్తున్న వాటికి కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.