Rashmika Mandanna : రష్మిక మందన్నకు ఇష్టమైన ప్లేస్ అదే.. వైరల్ స్టోరీ?

టాలీవుడ్ ప్రేక్షకులకు రష్మిక( Rashmika Mandanna ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇంట అడుగుపెట్టి.

 Rashmika Mandanna : రష్మిక మందన్నకు ఇష్టమ-TeluguStop.com

ఫస్ట్ లుక్ ది బెస్ట్ లుక్ అనిపించుకొని తన నటనకు గాను ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ప్రస్తుత సినీ రంగంలో పాన్ ఇండియా స్థాయిలో ఓ వెలుగు వెలుగుతుంది.

ఈ ముద్దుగుమ్మ తొలిసారిగా ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత ఆ పై వచ్చిన అంజనిపుత్ర, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు,భీష్మ , పొగరు, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది.టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ పొందింది.

అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ.ఇండియన్ క్రష్ గా ఓ ఊపు ఊపుతుంది.

Telugu Allu Arjun, Bheeshma, Favourite Place, Rashmika, Tollywood-Movie

గత ఏడాది వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప( Pushpa ), ‘ సినిమాలో వేరే లెవెల్ లో మెప్పించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత రష్మిక క్రేజ్ మరింత ఎక్కువగా పెరిగింది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ లిస్టులో రష్మిక కూడా ఒకరు.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తూ ఉంది.

Telugu Allu Arjun, Bheeshma, Favourite Place, Rashmika, Tollywood-Movie

ఇక సోషల్ మీడియా( Social media ) లో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఈమెకు బాగా ట్రోల్స్ కూడా వస్తుంటాయి.

ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.

ఇక ఈమెకు ఎంతమంది అభిమానులు అంతమంది హేటర్స్ ఉన్నారని చెప్పాలి.ఎందుకంటే అప్పుడప్పుడు ఈమె చేసే షో అలా ఉంటుంది కాబట్టి.

Telugu Allu Arjun, Bheeshma, Favourite Place, Rashmika, Tollywood-Movie

బయట ఎయిర్పోర్ట్లో, ఇంకా ఏదైనా ప్లేస్ లలో ఈమె మీడియా కంటపడితే చాలు మీడియా ముందు బాగా అతిగా ప్రవర్తిస్తూ ఉంటుంది.చిన్నపిల్లలగా మారిపోతుంది.అందరి దృష్టి తనపై పడాలి అన్నట్లుగా చేస్తూ ఉంటుంది.అందుకే కొందరు జనాలు ఈమె అతి వల్ల ఈమెను దూరం పెట్టేస్తూ ఉంటారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు ఖాళీ సమయం దొరకటంతో తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.

వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కనిపించింది.

ఇక కన్నడ భాషలో, తమిళ భాషలో మాట్లాడమని అడిగితే రెండు మూడు ముక్కల్లో మాట్లాడేసింది.ఒక తన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో చూపించమని అడగటంతో వెంటనే తన హ్యాండ్ రైటింగ్ కూడా చూపించింది.

ఇక ఓ అభిమాని తనకి ఇష్టమైన ప్లేస్ అడగటంతో తనకు ఇష్టమైన ప్లేస్ ఇల్లు అని చెప్పింది.ఇక అలా కాసేపు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టగా ఆ స్టోరీస్ అన్ని ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube