ఇంగ్లీష్‌తోనే సమస్తం: వలస కార్మికుల పిల్లల కోసం టీచరైన భారతీయ యువతి

కారణలేవైనా ఇంగ్లీషు ప్రపంచ భాషయింది.ప్రపంచీకరణ ప్రవేశం తర్వాత ఈ ధోరణి మరీ ఎక్కువైంది.

ప్రపంచం ఓ కుగ్రామం అయిందనడం సరైంది కాదు కానీ, ఇంగ్లిష్‌ ద్వారా ప్రపంచమంతా పరిచయం అవుతుంది.దేశవిదేశాలను కలుపుతుంది.

గర్భస్థ శిశువు కూడా మహాభారతంలో అభిమన్యుడిలా మీడియా ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఇంగ్లిష్‌ పదాలను నేర్చుకుంటున్నాడు.ఇంకా అనేక కారణాల వల్ల ఇంగ్లిష్‌ చదువడం, నేర్చుకోవడం, తప్పనిసరైంది.

రాష్ట్రం నుంచి దేశం, ప్రపంచదేశాల్లో ఎక్కడైనా బతుకాలంటే మాతృభాష సరిపోదు.ఇంగ్లిష్‌ వచ్చితీరాలి.భారతీయుల విషయానికి వస్తే మనదేశ జనాభాలో కనీసం 12.18 శాతం మంది ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలరని ఓ సర్వే తెలిపింది.అయితే భారత్‌తో పాటు వివిధ దేశాల్లో స్థిరపడిన ఎంతో మంది ఎన్ఆర్ఐలు అన్ని అర్హతలున్నా ఇంగ్లీషు రాక ఉద్యోగాలను పొందలేకపోతున్నారు.

Advertisement

దీనిని గ్రహించిన ఓ భారతీయ యువతి ఈ కష్టాలను దూరం చేయాలని భావించింది.దీనిలో భాగంగా చిన్న తనంలోనే భారతీయ చిన్నారులకు ఇంగ్లీషు నేర్పాలని నిర్ణయించింది.

వివరాల్లోకి వెళితే.ఆరుషి మిశ్రా అనే ప్రవాస భారతీయురాలు సింగపూర్‌లో స్థిరపడ్డారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌కు వున్న ప్రాముఖ్యాన్ని అర్దం చేసుకుని ఆరుషి వలస కార్మికుల పిల్లల కోసం టీచర్‌గా మారారు.ముంబయికి చెందిన ఆరుషి 2017లో తన కుటుంబంతో కలిసి సింగపూర్‌కు వెళ్లారు.

భారతదేశంలో వున్నప్పుడే ఓ ఎన్జీవోతో కలిసి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు ఇంగ్లీషు బోధిస్తూ వచ్చారామె.సింగపూర్ వెళ్లిన తరువాత కూడా దీనిని కొనసాగించాలనుకున్న ఆరుషి ‘ది ఇంగ్లీష్ లిటరసీ ప్రాజెక్ట్’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సింగపూర్‌లోని వలస కార్మికుల పిల్లలకు ముఖ్యంగా భారతదేశానికి చెందిన వారికి ఇంగ్లీషు నేర్పడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ఆరుషితో పాటు మరో 12 మంది వాలంటీర్లుగా ఉన్నారు.

Advertisement

వీరిలో 9 మంది సింగపూర్‌లో ఉండగా, మిగిలిన ముగ్గురు భారత్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.ఆమె ప్రయత్నాలు ఫలించి ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించడంతో పాటు స్థానికుల నుంచి ఆరుషి ప్రశంసలు అందుకుంటున్నారు.

అయితే ఈ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఆరుషి భావిస్తున్నారు.ఇందుకోసం తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలతో ప్రధాని కార్యాలయానికి సమాచారం కూడా ఇచ్చారు.

పీఎంవో నుంచి జవాబు కూడా వచ్చిందని ఆరుషి తెలిపారు.ఈ ప్రాజెక్టు గురించి విద్యాశాఖకు తెలియజేస్తామని ప్రధాని కార్యాలయం హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు.

ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో స్వల్పంగానే పాఠశాలలు ప్రారంభమయ్యాయి.పూర్తి స్థాయిలో స్కూళ్లు పనిచేయడం మొదలైన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలోనూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని ఆరుషి ఆకాంక్షించారు.

తాజా వార్తలు