ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని కలవర పెడుతున్న సమస్యల్లో అధిక బరువు ముందు వరసలో ఉంటుంది.అందులో ఎటువంటి సందేహం లేదు.
బరువు పెరగడం వల్ల శరీర ఆకృతి అందవిహీనంగా మారడమే కాదు.మధుమేహం, గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులెన్నో వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
అందుకే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.నోరు కట్టేసుకుని రకరకాల డైట్స్‌ను ఫాలో అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల జ్యూసులను తీసుకుంటే డైటింగ్ చేయకుండానే బరువు తగ్గుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూసులు ఏంటో తెలుసుకుందాం పదండీ.
టమాటో జ్యూస్..ఇది డైట్లో ఉంటే డైటింగ్ అక్కర్లేదు.ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక గ్లాస్ టమాటో జ్యూస్‌ను తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపునిండిన భావన కలిగి చిరు తిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.
అతి ఆకలి దూరం అవుతుంది.మెటబాలిజం రేటు పెరుగుతుంది.
ఫలితంగా శరీరంలోని క్యాలరీలు వేగంగా కరిగి సూపర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.
బీట్ రూట్ జ్యూస్. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందించే జ్యూసుల్లో ఇది ఒకటి.బరువును తగ్గించడానికీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
డైట్లో బీట్ రూట్ జ్యూస్ ను చేర్చుకుంటే ఎలాంటి డైటింగ్ చేయకపోయినా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.
దానిమ్మ జ్యూస్..రుచి పరంగానే కాదు దీనిలో పోషకాలు మెండుగానే నిండి ఉంటాయి.దానిమ్మ జ్యూస్‌ను తీసుకుంటే బరువు తగ్గడమే కాదు.కిడ్నీలు, కాలేయం శుభ్రపడతాయి.రక్తహీనత దూరం అవుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.
క్యాన్సర్, అల్జీమర్స్, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.మరియు రోగ నిరోధక వ్వవస్థ సైతం బలంగా మారుతుంది.