చలికాలంలో అజీర్తి అధికంగా వేధిస్తుందా.. అయితే ఈ పండ్లు మీ డైట్ లో ఉండాల్సిందే!

ప్రస్తుత చలికాలంలో సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో అజీర్తి( Indigestion ) ఒకటి.ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండటం వల్ల సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

దీని కారణంగా అజీర్తి తో సహా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.అయితే వీటికి చెక్ పెట్టడానికి కొన్ని కొన్ని పండ్లు చాలా గ్రేట్ గా సహాయ పడతాయి.

ఈ పండ్లను డైట్ లో చేర్చుకుంటే అజీర్తి అన్ని మాటే అనరు.మరి ఇంతకీ ఆ పండ్లు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రాక్ష పండ్లు ఫైబర్ తో పాటు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.ప్రస్తుత చలికాలంలో రోజుకు ఒక కప్పు ద్రాక్ష పండ్లను తీసుకుంటే జీర్ణ క్రియ చురుగ్గా పనిచేస్తుంది.

Advertisement

దాంతో అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.పైగా ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు.

అలాగే చలికాలంలో జీర్ణ సమస్యలకు దూరంగా ఉండటానికి తీసుకోవాల్సిన పండ్లలో బెర్రీ పండ్లు ( Berry fruits )కూడా ఒకటి.బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ వంటి పండ్లను తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య పరార్ అవుతుంది.ఆహారం వేగంగా జీర్ణం అవుతుంది.

మరియు బెర్రీ పండ్లు రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి సీజన్ వ్యాధులకు అడ్డుకట్టగా కూడా నిలుస్తాయి.

అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు రోజుకు ఒక యాపిల్ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్( Apple ) లో ఫైబర్ మెండుగా ఉంటుంది.అందువల్ల యాపిల్ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.కివీ పండులోనూ ఫైబర్ రిచ్ గా ఉంటుంది.

Advertisement

రోజుకు ఒక కివీ పండును( Kiwi fruit )తీసుకుంటే అజీర్తి మళ్లీ మీ వంక కూడా చూడదు.ఇక దానిమ్మ ఆరెంజ్ వంటి పండ్లను సైతం తీసుకోవచ్చు చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరచడానికి అద్భుతంగా తోడ్పడతాయి.

తాజా వార్తలు