నిద్రించే ముందు ఇవి తీసుకుంటే బ‌రువు త‌గ్గుతార‌ట‌..తెలుసా?

అధిక బరువు.ఇటీవ‌ల‌ మ‌ధ్య కాలంలో ఎంద‌రికో పెద్ద శాపంగా మారింది.

ఈ నేప‌థ్యంలోనే పెరిగిన బ‌రువును క‌రిగించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

క‌ఠిన‌మైన డైట్లు పాటించ‌డం, ర‌క‌ర‌కాల వ్యాయామాలు చేయ‌డం, యోగాస‌నాలు వేయ‌డం ఇలా బ‌రువు త‌గ్గేందుకు ఎన్నో చేస్తుంటారు.

అయితే వీటితో పాటుగా నిద్రించే ముందు కొన్ని కొన్ని పానియాల‌ను తీసుకుంటే.వేగంగా బ‌రువు త‌గ్గొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.

మ‌రి లేట్ చేయ‌కుండా ఆ పానియాలు ఏంటో చూసేయండి.ప్ర‌తి రోజు నిద్రించే ముందు చమోమిలే టీ తీసుకుంటే.

Advertisement

ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గొచ్చు.చమోమిలే టీ అంటే చామంతి పూలతో త‌యారు చేసిన టీ.ఈ చమోమిలే టీలో ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉన్నాయి.ముఖ్యంగా నిద్రపోయే ముందు తాగడం వల్ల శరీర బరువుని పెంచడానికి తోడ్పడే హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది.

మ‌రియు నిద్ర కూడా బాగా ప‌డుతుంది.అలాగే మెంతి టీ కూడా అధిక బ‌రువును నియంత్రిస్తుంది.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో ఒక స్పూన్ మెంతి పొడి వేసి బాగా మ‌రిగించి వ‌డ‌బోసుకోవాలి.ఇప్పుడు ఈ టీలో కొద్దిగా తేనె మిక్స్ చేసి సేవించాలి.

ఇలా ప్ర‌తి రోజు నిద్ర‌పోయే ముందు చేస్తే.శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌ర‌గ‌డం స్టార్ట్ అవుతుంది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

దాంతో మీరు క్ర‌మంగా వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

దాల్చిన చెక్క టీకి బ‌రువును త‌గ్గించే సామార్థ్యం ఉంది.ఒక క‌ప్పు నీటిలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా హీట్ చేయాలి.ఆ త‌ర్వాత వ‌డ‌బోసుకుని సేవించాలి.

కావాలీ అనుకుంటే తేనెను మిక్స్ చేసుకోవ‌చ్చు.రెగ్యుల‌ర్‌గా నిద్ర పోవ‌డానికి ముందు ఈ దాల్చిన చెక్క టీ తీసుకుంటే.

త‌ప్ప‌కుండా బ‌రువు త‌గ్గుతారు.ముఖ్యంగా పొట్ట చుట్టు ఏర్ప‌డిన కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది.

తాజా వార్తలు