'ఆచార్య' నష్టాన్ని భరించిన ఆ ముగ్గురు... ఎన్ని కోట్లో తెలుసా?

గత నెల ఏప్రిల్ 29 న ఎంతో గ్రాండ్ గా ఆచార్య మూవీ రిలీజ్ అయింది.ఈ సినిమాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు అతని కొడుకు రామ్ చరణ్ లు మొదటిసారిగా ఎక్కువ సమయం స్క్రీన్ ను పంచుకున్నారు.

 These Celebs Return Acharya Movie Remuneration To Distributors Details, Acharya-TeluguStop.com

మరియు టాలీవుడ్ లో ఇప్పటి వరకు అపజయం అన్నదే ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వంటి పలు కారణాల వలన ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుండే ప్లాప్ టాక్ ను తెచ్చుకుని డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది.

ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని అటు మెగాస్టార్ ఇటు కొరటాల తీవ్రంగా శ్రమించారు.కానీ ఈ సినిమా కోసం మొత్తం నాలుగు సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది.

అంతే కాకుండా సమయం దొరకడంతో కథను కూడా మార్చి రీ షూట్ చేశారు.ఇలాంటి అతి తక్కువ కారణాల వలన ప్రి రిలీజ్ పై బజ్ తగ్గింది.

బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది.

అలా ఎట్టకేలకు ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

కానీ థియేటర్ లో విడుదల అయిన వారం రోజులకే తన సమరాన్ని ముగించింది.అయితే ఈ వారం రోజులో ముక్కీ మూలిగి 50 కోట్లు కలెక్షన్ లను మాత్రమే రాబట్టగలిగింది.

దీనితో 80 కోట్ల భారీ నష్టం వచ్చింది.ఈ సినిమాను కొన్న బయ్యర్లు అంతా రోడ్డున పడ్డారు.

అందుకే బయ్యర్లు చిరంజీవి మమ్మల్ని ఆదుకోకపోతే… మా బ్రతుకులు నాశనం అవుతాయని లెటర్ ద్వారా విజ్ఞప్తి చేసుకున్నారు.ఈ విషయంపై ఆలోచించిన దర్శకుడు కొరటాల, చిరంజీవి మరియు రామ్ చరణ్ లో ఎంతో కొంత బయ్యర్లకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Telugu Acharya, Acharya Buyers, Acharya Flop, Chiranjeevi, Ram Charan-Movie

అందులో భాగంగా చిరంజీవి ఇప్పటికే 10 కోట్లు బయ్యర్లకు ఇవ్వడం జరిగింది.అయితే అంతకు ముందు అంటే సినిమా రిలీజ్ ఎప్పుడు నిర్మాతలు మరో 10 కోట్లు ఇచ్చాడని వార్తలు వచ్చాయి.తాజాగా కొరటాల శివ కూడా 25 కోట్లు తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ విషయం సినిమా పరిశ్రమలో సంచలనం అయింది.దర్శకుడు అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అంటూ కొరటాలను అందరూ కొనియాడారు.ఇక మిగిలింది రామ్ చరణ్… ఈయన కూడా త్వరలోనే ఎంతో కొంత నిర్మాతలకు ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

ఏదైతే ఏమి ఆచార్య మాత్రం అందరికీ తీవ్ర నష్టాలను మిగిల్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube