తెలుగులో విలన్లు గా మారిన యంగ్ హీరోలు వీళ్లే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇప్పటికే చాలా మంది విలన్లు వస్తున్న నేపథ్యంలో ఇంకా కొంత మంది యంగ్ హీరోలు( Young heroes ) కూడా ప్రస్తుతం విలన్లు గా వాళ్ల సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎవరెవరు ఉన్నారో ఒకసారి తెలుసుకుందాం.ఒకపుడు హీరో గా చేసి మంచి గుర్తింపు పొందిన ప్రిన్స్ ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు…బోయపాటి, రామ్ పోతినేని కాంబో లో వస్తున్న స్కంద సినిమాలో( Skanda ) విలన్ గా నటిస్తున్నాడు.

 These Are The Young Heroes Who Became Villains In Telugu, Young Vilans, Naveen C-TeluguStop.com

ఇక ఇప్పటికే ప్రిన్స్ విలనిజం గురించి ఆయన పోషించిన పాత్ర గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి… అయితే ప్రిన్స్ ఈ సినిమా తో విలన్ గా అలరిస్తే తెలుగులో మంచి విలన్ అవుతాడు అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.ఇక బోయపాటి సినిమాలో విలన్ అంటే ఏ రేంజ్ లో ఉంటాడో మన అందరికీ తెలిసిన విషయమే అందుకే బోయపాటి విలన్లను చూపించడం లో దిట్ట అనే చెప్పాలి.

Telugu Gang, Karthikeya, Naveen Chandra, Skanda, Youngheroes, Tollywood, Young V

ఇక ఈయన కంటే ముందే హీరో నవీన్ చంద్ర ( Naveen Chandra )కూడా విలన్ గా మారిన విషయం మనకు తెలిసిందే.ఎన్టీయార్ హీరో గా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో నవీన్ చంద్ర విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఈయన ఈ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా నటించి ప్రస్తుతం అటు హీరో గా ఇటు విలన్ గా చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.

 These Are The Young Heroes Who Became Villains In Telugu, Young Vilans, Naveen C-TeluguStop.com
Telugu Gang, Karthikeya, Naveen Chandra, Skanda, Youngheroes, Tollywood, Young V

ఇక ఆర్ ఎక్స్ 100 సినిమాతో మన ముందుకు వచ్చిన కార్తికేయ( Karthikeya ) కూడా హీరో గా సక్సెస్ అయినప్పటికీ నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ ( Gang leader )సినిమా లో ఆ పాత్ర నచ్చి విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.దాంతో ఏకంగా తమిళ్ స్టార్ హీరో అయిన అజిత్ హీరో గా చేసిన వలిమై సినిమాలో కూడా విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube